దేశద్రోహం కేసు నమోదై పరారీలో ఉన్న సీఏఏ వ్యతిరేక ఆందోళనకారుడు.. షార్జీల్ ఇమామ్‌ను అరెస్టు చేసినట్లు బిహార్ పోలీసులు తెలిపారు. అసోంను దేశం నుంచి విడగొట్టాలంటూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన ఇమామ్‌ను... అతని స్వస్థలం బిహార్‌లోని జహానాబాద్ జిల్లా కాకో గ్రామంలో మంగళవారం అరెస్టు చేసినట్లు రాష్ట్ర పోలీసు చీఫ్ గుప్తేశ్వర పాండ్యా వెల్లడించారు.
ఇమామ్‌ను బిహార్ కోర్టులో హాజరుపరిచి, అనంతరం రిమాండ్‌కు తరలించారు. విచారణ బిహార్‌లో జరుగుతుందా? దిల్లీలో జరుగుతుందా? అనే దానిపై స్పష్టత రాలేదు.
షా వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే!
దిల్లీ ఎన్నికల ప్రచారాల్లో భాగంగా షార్జీల్ ఇమామ్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే అతడిని పోలీసులు అరెస్టు చేశారు. షార్జీల్‌ను అదుపులోకి తీసుకుంటారా? లేదా? అని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు షా.
చివరకు బిహార్‌లో అరెస్ట్..
జేఎన్‌యూ పరిశోధక విద్యార్థి అయిన ఇమామ్‌ను పట్టుకోవడానికి దిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, అసోం, మణిపుర్, అరుణాచల్‌ప్రదేశ్ పోలీసులు ప్రయత్నాలు చేశారు. అతని పూర్వీకుల ఇళ్లల్లో బిహార్ పోలీసులు ఆదివారం సోదాలు నిర్వహించారు. చివరకు మంగళవారం ఉదయం బిహార్ పోలీసులకు చిక్కాడు ఇమామ్.
దేశద్రోహం కేసు నమోదు..
'ఈశాన్య రాష్ట్రాలను దేశం నుంచి వేరు చేయండి. రోడ్డు, రైలు మార్గాలు బాగాలేవు. వాటిని బాగుచేయండి. అసోంను విడదీయడం మా బాధ్యత. విన్నపం ఆలకించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికే రాష్ట్రంలోని ముస్లింలు నిర్బంధ కేంద్రాల్లో ఉన్నారని' ఇమామ్ వ్యాఖ్యానించినట్లుగా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దాని ఆధారంగా దిల్లీలో పోలీసులు ఇమామ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు.
షార్జీల్ ఇమామ్ అరెస్ట్ ఇదీ చూడండి:'కేజ్రీ... దమ్ముంటే ఆ నిరసనల్లో పాల్గొనండి'