తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముగ్గురు మంత్రులకు కరోనా పాజిటివ్​ - ఒడిశా మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి తుకుని సాహుకు కరోనా

దేశంలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అనేక మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా పలు రాష్ట్రాలకు చెందిన మంత్రులకు మహమ్మారి సోకింది.

Another Kerala minister tests positive for COVID-19
ఆ ముగ్గురు మంత్రులకు కరోనా పాజిటివ్​

By

Published : Sep 11, 2020, 3:23 PM IST

కరోనా వైరస్​ సామాన్యులనే కాకుండా రాజకీయ నాయకులను సైతం వదలటం లేదు. తాజాగా కేరళ పరిశ్రమల శాఖ మంత్రి జయరాజన్ వైరస్​ బారిన పడ్డారు. ఇప్పటికే పినరయి విజయన్ కేబినేట్​లో ఇద్దరు మంత్రులు వైరస్​ బారిన పడ్డారు.

సదరు మంత్రితో పాటు ఆయన సతీమణి కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో వీరిద్దరిని కాన్నూర్​లోని పరియరామ్​ మెడికల్​ కాలేజీ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతకుమునుపు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ కరోనా పాజిటివ్​గా తేలింది. ఐజాక్ సన్నిహితుల్లో జయరాజన్​ ఉండటం వల్ల మూడో రోజుల క్రితం నమూనాను పరీక్షకు పంపగా.. శుక్రవారం పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది.

ఒడిశా మంత్రికి..

మరో వైపు ఒడిశా మహిళా, శిశు అభివృద్ధి, మిషన్ శక్తి మంత్రి తుకుని సాహు కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. తుకుని సాహుతో కలిపి ఆ రాష్ట్రంలో వైరస్​ సోకిన మంత్రుల సంఖ్య ఐదు చేరింది.

ప్రస్తుతం హోం ఐసోలేషన్​లో ఉన్నట్లు తెలిపిన మంత్రి.. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. రాష్ట్రంలో ముగ్గురు లోక్​సభ సభ్యులకు, మరి కొంత మంది అధికార పార్టికి చెందిన ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్​గా తేలింది.

యూపీ మంత్రికి కూడా...

ఉత్తర్​ప్రదేశ్ జైళ్ల శాఖ మంత్రి జై కుమార్ సింగ్​కు శుక్రవారం కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్​ ఉన్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 12 మంది మంత్రులు కరోనా బారినపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details