'అరుంధతి' మృతికి బ్యాక్టీరియానే కారణం! తిరువనంతపురం జూపార్క్‌లో ఓ అనకొండ మృతి చెందింది. అరుంధతిగా నామకరణం చేసిన దీని మృతికి బ్యాక్టీరియానే కారణమని తెలుస్తోంది.
రెండు నెలల కిందట శ్రీలంక నుంచి ఏడు అనకొండలను తీసుకొచ్చారు అధికారులు. అయిదు ఆడ, రెండు మగ అనకొండలు ఉండేవి. ఇందులో రెండు ఆడ, రెండు మగవి చనిపోయాయి. ప్రస్తుతం మూడు మాత్రమే మిగిలాయి.
ఇంతకుముందు మృతి చెందిన వాటిలో రెండు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో మృతి చెందగా.. ఒకటి జతకట్టే సమయంలో చనిపోయింది.
మృతి చెందిన అనకొండలను పరీక్షించిన వైద్య అధికారులు ఎంటమోబియా అనే బ్యాక్టీరియా కారణంగా మృతి చెందినట్లు తేల్చారు. ఈ బ్యాక్టీరియాకు విరుగుడుగా పలు చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మిగిలి ఉన్న మూడు అనకొండలకు కూడా వైరస్ వ్యాప్తి చెందినట్లు సమాచారం. అయితే చికిత్స కారణంగా మిగిలిన మూడింటి ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: సేనకు ఊహించని షాక్- 'థ్రిల్లర్'ను తలపించిన రాజకీయం