ఏదైనా పెద్ద పెద్ద వ్యాపారాల్లో యజమానులు మోసానికి పాల్పడితే వాణిజ్య సుంకాల శాఖ అధికారులు నోటీసులు ఇవ్వడం తెలుసు. కానీ.. కచోరీలు అమ్ముకునే చిరు వ్యాపారికి నోటీసులు ఇవ్వడం ఎప్పుడైనా చూశారా. ఇది నిజం.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో 'ముకేశ్ కచోరీ బండార్' అనే చిన్న దుకాణంపై ఇటీవల సోదాలు జరిపారు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు. ఆ దుకాణం ద్వారా ముకేశ్ అనే వ్యాపారి ఏడాదికి రూ.60 లక్షలకు పైగా సంపాదిస్తున్నట్లు గుర్తించారు. చిన్న వ్యాపారమే అయినా భారీగా ఆదాయం వస్తున్న కారణంగా ఎలాంటి పన్నులు చెల్లించలేదని, దుకాణాన్ని జీఎస్టీ కింద నమోదు చేసుకోలేదని నోటీసులు జారీ చేశారు. వెంటనే జీఎస్టీ కింద దుకాణాన్ని రిజిస్ట్రేషన్ చేయించి, ఏడాది కాలనికి పన్ను చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
"జీఎస్టీ పరిధి ధాటితే సుంకాలు చెల్లించాలి. కానీ కొంతమంది వ్యాపారులు చెల్లించట్లేదు. ఈ కచోరీ కేసు కూడా అలాంటిదే. ఈయన ఆదాయం ఎక్కువే. అయినా సుంకాలు చెల్లించట్లేదు. 7లక్షలకు మించి ఆదాయం వస్తోందని మా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆధారాలను పరిశీలించి మరింత విచారణ చేస్తాం "