తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్మృతివనంతో 'బాలు'కు అభిమానుల ఘన నివాళి

సంగీతంలో గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం జ్ఞాపకాలను నెమరు వేసుకొనే క్రమంలో ఆయన పేరుతో తమిళనాడు కోయంబత్తూర్​లో స్మృతివనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పెరుర్​ చెట్టిపలయమ్​ పంచాయతీ భాగస్వామ్యంతో సిరుతులి స్వచ్ఛంద సంస్థ చేపట్టింది.

Forest for SP Balu
ఎస్బీ బాలు పేరిట స్మృతివనం

By

Published : Dec 16, 2020, 6:36 PM IST

Updated : Dec 16, 2020, 10:51 PM IST

గానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యాన్ని స్మరించుకుంటూ.. తమిళనాడులోని కోయంబత్తూర్​లో స్మృతివనం ఏర్పాటు చేశారు. తన చివరి కార్యక్రమంలో 'భూమిని నాశనం చేస్తున్నందుకు మనం చెల్లించే మూల్యమే కరోనా. పర్యావరణాన్ని రక్షించే కార్యక్రమాల్లో సంగీత ప్రియులు పాలుపంచుకోవాలి' అని కోరారు బాలు. ఆయన మాటలను స్ఫూర్తిగా తీసుకున్న 'సిరుతులి' అనే స్వచ్ఛంద సంస్థ.. ​ కోయంబత్తూర్​ పెరుర్​ చెట్టిపలయమ్​ పంచాయతీ భాగస్వామ్యంతో పంచపలయమ్​ ఆఫీసర్స్​ కాలనీలో స్మృతివనం నిర్మించింది.

స్మృతివనంతో 'బాలు'కు అభిమానుల ఘన నివాళి

బాలు 74 ఏళ్ల జీవితానికి జ్ఞాపకార్థంగా.. ఈ స్మృతివనంలో 74 మొక్కలను నాటారు. ఇందులో ఓ ప్రత్యేకత ఉంది. సంగీత వాద్యాలను తయారు చేసేందుకు వినియోగించే చెట్ల మొక్కలనే ఇక్కడ నాటారు. ఈ స్థలాన్ని బాలు పాడిన పాటల్లోని దేవతలకు అంకితమిచ్చారు. అందులో ఎస్పీబీ జన్మనక్షత్రం ఆశ్లేషకు గుర్తుగా సంగీత చిహ్నం ఆకృతిని సృష్టించారు.

ఎస్పీ బాలు పేరిట స్మృతివనం
స్మృతివనం

" పద్మభూషణ్​ బాల సుబ్రహ్మణ్యం సెప్టెంబర్​లో కన్నుమూశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియుల హృదయాల్లో ఎన్నో మదురస్మృతులను మిగిల్చి వెళ్లారు. ఆయన స్మృతులు చిరకాలం మనతోనే ఉండేలా.. ఏదైనా చేయాలని మాలో కొందరం నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఎస్పీబీ పేరిట స్మృతివనం నిర్మించాలనుకున్నాం. ఆయన 74 ఏళ్ల జీవితానికి జ్ఞాపకార్థంగా 74 మొక్కలు నాటాం. అందులో ముఖ్యంగా సంగీత వాద్యాలు తయారు చేసేందుకు ఉపయోగించే టేకు, వెదురు, ఎర్రచందనం వంటివి ఉన్నాయి.

- వనితా మోహన్​, మేనేజింగ్​ ట్రస్టీ, సిరుతులి ఆర్గనైజేషన్​

స్మృతివనం విహాంగ వీక్షణం

పెరుర్​ చెట్టిపలయమ్​ పంచాయతీ, ఆఫీసర్స్​ కాలనీ అసోసియేషన్​ సంయుక్తంగా.. మొత్తం 1.8 ఎకరాల్లో ఈ ఎస్పీబీ స్మృతివనం ఏర్పాటుకు కృషి చేసినట్లు తెలిపారు వనితా మోహన్​. అందులో చిన్నపిల్లలకు ప్రత్యేక విభాగం, గ్రంథాలయం ఉన్నట్లు వెల్లడించారు. ఈ ప్రాంతంలో బాలు స్మృతివనం ఏర్పాటు చేయటం పట్ల పెరుర్​ చెట్టిపలయమ్​ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని, ఇందుకు పాటుపడిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు.

ఎస్పీ బాలు పేరిట స్మృతివనం
స్మృతివనంలో సంగీత చిహ్నం

ఇదీ చూడండి:స్వర్ణ విజయ జ్యోతి వెలిగించిన ప్రధాని

Last Updated : Dec 16, 2020, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details