తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు చండీగఢ్​లో ఉత్తర మండల కౌన్సిల్​ సమావేశం

హరియాణా చండీగఢ్​లో నేడు జరుగనున్న ఉత్తర మండల కౌన్సిల్ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్​షా అధ్యక్షత వహించనున్నారు. ఈ కౌన్సిల్​లో కేంద్ర-రాష్ట్రాల మధ్య, రాష్ట్రాలు-రాష్ట్రాలకు మధ్య తలెత్తే సరిహద్దు వివాదాలు చర్చిస్తారు. అలాగే భద్రత, మౌలిక సదుపాయాలు, రవాణా, పరిశ్రమలు, విద్య తదితర అంశాలపై లోతుగా చర్చించనున్నారు.

ఉత్తర మండల కౌన్సిల్ అధ్యక్షుడిగా అమిత్​షా

By

Published : Sep 20, 2019, 6:27 AM IST

Updated : Oct 1, 2019, 7:03 AM IST

ఉత్తర మండల కౌన్సిల్​ సమావేశం నేడు చండీగఢ్​లో జరుగనుంది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రలు పాల్గొనే ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్​షా అధ్యక్షత వహించనున్నారు. హరియాణా ముఖ్యమంత్రి ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

"కేంద్ర-రాష్ట్రాల మధ్య, రాష్ట్రాలకు-రాష్ట్రాలకు మధ్య ఉండే సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం కృషి చేస్తుంది. ఇందు కోసం జోనల్ కౌన్సిల్ ఓ ఫోరమును రూపొందిస్తుంది." - అధికారిక ప్రకటన

సభ్య రాష్ట్రాలు...

ఉత్తర జోనల్​ కౌన్సిల్​లో.... హరియాణా, హిమాచల్​ ప్రదేశ్​, పంజాబ్​, రాజస్థాన్​లు, కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ము కశ్మీర్​, లద్ధాఖ్​, దిల్లీలు ఉన్నాయి. కౌన్సిల్ సమావేశానికి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. అలాగే ప్రతి సభ్య రాష్ట్రం నుంచి ఇద్దరు మంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనాధికారులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ అధికారులు హాజరవుతారు.

విస్తృత చర్చ

సరిహద్దు వివాదాలు, భద్రత, మౌలిక సదుపాయాలైన రోడ్డు రవాణా, పరిశ్రమలు, నీరు, విద్యుత్​ సహా పలు సమస్యలపై ఈ జోనల్​ కౌన్సిల్​ ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే అడవులు, పర్యావరణం, గృహనిర్మాణం, విద్య, ఆహార భద్రత, పర్యాటకం తదితర అంశాలను జోనల్ కౌన్సిల్​లో విస్తృత స్థాయిలో చర్చిస్తారు.

ఇదీ చూడండి: చంద్రయాన్​-2 ల్యాండర్​​ 'విక్రమ్' ఫోటోలు తీసిన నాసా!

Last Updated : Oct 1, 2019, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details