తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. బంగారు బంగాల్​ నిర్మిస్తాం' - అమిత్​ షా రోడ్​ షో

బంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. రాజకీయ హింస, దోపిడీ, బంగ్లాదేశీయుల చొరబాట్లు లేని బంగాల్​ను చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. తమకు ఒక్క అవకాశం ఇస్తే.. 'బంగారు​ బంగాల్'​ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

Amit Shah holds roadshow
కేంద్ర హోంమంత్రి అమిత్​ షా

By

Published : Dec 20, 2020, 4:31 PM IST

Updated : Dec 20, 2020, 4:56 PM IST

మార్పు కోసం బంగాల్​ ప్రజలు ఆరాటపడుతున్నారని.. రాజకీయ హింస, దోపిడీ, బంగ్లదేశీయుల చొరబాట్లు లేని రాష్ట్రాన్ని చూడాలనుకుంటున్నారని తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. బీర్భమ్​ జిల్లాలోని బోల్​పుర్​లో నిర్వహించిన భారీ రోడ్​ షోలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భాజపాకు అధికారం ఇస్తే.. 'బంగారు బంగాల్'​ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

రోడ్​ షోలో అమిత్​ షా

"నా జీవితంలో చాలా రోడ్​ షోలలో పాల్గొన్నా. కానీ ఇలాంటి రోడ్​ షోను ఎప్పుడూ చూడలేదు. ప్రధాని మోదీ పట్ల బంగాల్​ ప్రజల నమ్మకం, ప్రేమను ఈ రోడ్​ షో తెలియచెబుతోంది. అలాగే.. మమతా దీదీ పట్ల బంగాల్​ ప్రజల ఆగ్రహాన్ని సూచిస్తోంది. బంగాల్​ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అది రాజకీయ నాయకుడి మార్పు మాత్రమే కాదు. రాజకీయ హింస, దోపిడీ, బంగ్లాదేశీయుల చొరబాట్లు లేని బంగాల్​ను చూడాలనుకుంటున్నారు. నరేంద్ర మోదీకి ఒక్క అవకాశం ఇవ్వండి. ఐదేళ్లలో బంగారు బంగాల్​ను నిర్మిస్తాం."

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

అమిత్​ షాతో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​, కీలక నేతలు రోడ్​ షోలో పాల్గొన్నారు. మద్దతుదారులు రహదారుల వెంట బారులు తీరి... 'జై శ్రీరాం', 'నరేంద్ర మోదీ జిందాబాద్'​, 'అమిత్​ షా జిందాబాద్'​ నినాదాలతో హోరెత్తించారు. డాక్‌బంగ్లో మైదానం నుంచి బోల్​పుర్​ చౌరస్తా వరకు సాగిందీ రోడ్​ షో.

షా రోడ్​ షోకు భారీగా హాజరైన జనం
రోడ్​ షోలో జనవాహిని

ఇదీ చూడండి: జానపద గాయకుడి ఇంట్లో అమిత్​ షా విందు

Last Updated : Dec 20, 2020, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details