తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు కేబినెట్​ భేటీ.. కశ్మీర్​పైనే కీలక నిర్ణయాలా...?

జమ్ముకశ్మీర్​కు సంబంధించి కేంద్రం ఏదో కీలక నిర్ణయం తీసుకోనుందంటూ దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న వేళ.. నేడు కేబినెట్​ సమావేశమవనుంది. జమ్మూ అమర్​నాథ్​ యాత్ర రద్దుతో పాటు.. భద్రతా బలగాలను భారీగా మోహరిస్తున్న తరుణంలో భేటీ చర్చనీయాంశంగా మారింది.

నేడు కేబినెట్​ భేటీ.. కశ్మీర్​పైనే కీలక నిర్ణయాలా...?

By

Published : Aug 5, 2019, 5:16 AM IST

Updated : Aug 5, 2019, 6:25 AM IST

కశ్మీర్​ అంశంపై నేడు కేబినెట్​ భేటీ

జమ్ముకశ్మీర్​ పరిస్థితులపై రకరకాల ఊహాగానాలు, ఆందోళనలు కొనసాగుతున్న తరుణంలో నేడు కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఉదయం 9.30 గంటలకు సమావేశమవనుంది. భద్రతా వ్యవహారాల మంత్రివర్గ కమిటీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ సమావేశమూ జరగనుంది.

సాధారణంగా మంత్రివర్గ సమావేశాలు బుధవారం జరుగుతుంటాయి. ఆకస్మికంగా ఈ సారి సోమవారం భేటీ కానుండటంతో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశం అజెండాపై స్పష్టత లేకున్నా.. జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక హక్కులు కల్పించే అధికరణలు 35-ఏ, 370 ని రద్దు చేసేందుకేననే ఊహాగానాలు జోరందుకున్నాయి. అధికారికంగా ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించనప్పటికీ అసాధారణ ప్రతిపాదనలు ఉండొచ్చని తెలుస్తోంది.

సమావేశాల నేపథ్యంలో...

అయితే.. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 7న ముగుస్తున్నందున పెండింగ్​ బిల్లులు ఆమోదింపజేసుకునేందుకే మంత్రివర్గం సమావేశమవనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి.. ఆమోదించేలా చేయాలని చూస్తున్నట్లు చెబుతున్నారు.

Last Updated : Aug 5, 2019, 6:25 AM IST

ABOUT THE AUTHOR

...view details