తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హైఅలర్ట్​: ఐటీబీపీకి హోంశాఖ కీలక ఆదేశాలు!

సరిహద్దులో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఐటీబీపీ, ఎస్​ఎస్​బీ బలగాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఈ మేరకు వాస్తవాదీన రేఖ వెంబడి కీలక ప్రదేశాలుగా పరిగణిస్తున్న సిక్కిం, ఉత్తరాఖండ్​ ట్రై-జంక్షన్​లో భారీగా భద్రతా బలగాలను మోహరిస్తున్నట్లు సమాచారం.

Amid India-China tensions, MHA puts ITBP, SSB on high alert
హైఅలర్ట్​: భద్రత దళాలకు హోంశాఖ కీలక ఆదేశాలు!

By

Published : Sep 3, 2020, 10:56 PM IST

వాస్తవాదీన రేఖ (ఎల్​ఓసీ) వెంబడి ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండో-టిబెటన్ బోర్డర్​ పోలీస్​(ఐటీబీపీ), శశస్త్ర సీమా బల్(ఎస్​ఎస్​బీ) సైనిక బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ​​సరిహద్దు నిర్వహణ కార్యదర్శి, హోంమంత్రిత్వ శాఖ, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ ఉన్నతాధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.

కీలక ప్రాంతాల్లో హైఅలర్ట్​!

ఇప్పటికే ఎస్ఎస్​బీకి చెందిన పలు సైనిక బృందాలను అరుణాచల్​ ప్రదేశ్​, భారత్​-నేపాల్​ సరిహద్దు ప్రాంతాలకు తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అత్యంత కీలక ప్రదేశాలుగా పరిగణిస్తున్న ఉత్తరాఖండ్​, సిక్కింలో భారత్-చైనా-టిబెట్​ కలిసే ట్రై-జంక్షన్​ సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది.

చైనా సరిహద్దుల్లో పారా మిలటరీ దళాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఉత్తరాఖండ్​, అరుణాచల్​ ప్రదేశ్​, హిమాచల్​ప్రదేశ్​, లద్దాఖ్​, సిక్కిం సరిహద్దుల్లోనూ హైఅలర్ట్​ ప్రకటించారు. సిక్కిం, ఉత్తరాఖండ్ ట్రై-జంక్షన్​ ప్రాంతాలకు 80 సైనిక బలగాలను పంపినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి భద్రతా చర్యల్ని పరిశీలించేందుకు భారత ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే లేహ్‌లో పర్యటిస్తున్నారు.

ఇదీ చూడండి:'చైనా ఏకపక్ష ధోరణి వల్లే ఈ ఉద్రిక్త పరిస్థితులు'

ABOUT THE AUTHOR

...view details