కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. యాత్ర మొదటి రోజు 8403 మంది భక్తులు పూజలు చేశారని అధికారులు వెల్లడించారు. గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రధాన పూజ చేసి ఉత్సవాన్ని ప్రారంభించారు. 3880 అడుగుల ఎత్తులో ఉన్న మంచు శివలింగం వద్ద రాష్ట్రం బాగుండాలని ప్రత్యేక పూజలు చేశారు గవర్నర్.
అమర్నాథ్కు వెళ్లే రెండు బేస్ క్యాంపులు పాల్గామ్, బల్తాల్ వద్ద అధికారులు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. 6884 మంది యాత్రికులు బల్తాల్ మార్గం నుంచి, 3065 మంది పాల్గామ్ నుంచి చేరుకుని అమర్నాథున్ని దర్శించారని అధికారులు వెల్లడించారు.