తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'త్రిసభ్య కమిటీ ముందు ఇక హాజరు కాను' - కమిటీ

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ కోసం ఏర్పాటైన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీ ముందుకు ఇక మీదట హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు ఫిర్యాదుదారైన సుప్రీం కోర్టు మాజీ ఉద్యోగిని వెల్లడించారు.

'త్రిసభ్య కమిటీ ముందు ఇక హాజరు కాను'

By

Published : May 1, 2019, 6:50 AM IST

'త్రిసభ్య కమిటీ ముందు ఇక హాజరు కాను'

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌రంజన్‌ గొగొయిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసు కొత్త మలుపు తిరిగింది. అంతర్గత దర్యాప్తు కమిటీ విచారణను బహిష్కరిస్తున్నట్లు సీజేఐపై ఆరోపణలు చేసిన సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని ప్రకటించారు.

ఈ కమిటీ వల్ల తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

"లైంగిక వేధింపుల ఆరోపణలు ఇంత ఆలస్యంగా ఎందుకు చేయాల్సి వచ్చిందని కమిటీ పదేపదే ప్రశ్నించింది. కమిటీ ముందు వాతావరణం చాలా భయపట్టేలా ఉంది"
- ఫిర్యాదుదారైన సుప్రీం మాజీ ఉద్యోగిని

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే సారథ్యంలో జస్టిస్‌ ఇందూ మల్హోత్రా, జస్టిస్‌ ఇందిరా బెనర్జీ సభ్యులుగా అంతర్గత దర్యాప్తు కమిటీ ఏర్పాటైంది.

ఈ కమిటీ ఈనెల 26, 29 తేదీల్లో సమావేశమై విచారణ చేపట్టింది. అంతర్గత దర్యాప్తు కమిటీ విచారణపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన ఆమె తన న్యాయవాదిని అనుమతించకపోవటమే కాకుండా, తన వాంగ్మూలానికి సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్‌ కూడా చేయడం లేదని పేర్కొన్నారు. ఈ కమిటీ అనుసరిస్తున్న విధివిధానాల గురించి తనకు సమాచారం ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details