ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆకాశమార్గానికే ఓటు... హెలికాప్టర్లన్నీ ఫుల్ - నాయకులు

ప్రచారం చేయాల్సిన ప్రదేశాలు ఎన్నో. ఉన్న సమయమేమో తక్కువ. అలాంటప్పుడు ఏం చేయాలి? బస్సులు, కార్లలో వెళితే అయ్యే పనేనా. అందుకే దేశంలో అందుబాటులో ఉన్న చిన్న విమానాలు, హెలికాప్టర్లను బుక్​ చేసేశారు రాజకీయ నేతలు.

హెలికాప్టర్​
author img

By

Published : Mar 21, 2019, 1:19 PM IST

ఎన్నికల ప్రచారం కారణంగా ముందుగానే బుక్​ అయిన హెలికాప్టర్లు
ఎన్నికల ప్రచారమంటే మామూలు విషయమా! జాతీయ నాయకులైతే దేశమంతా, రాష్ట్రనేతలైతే రాష్ట్రమంతా తిరగాల్సిందే. ప్రచారానికి బస్సులు, కార్లలో ప్రయాణమైతే ఎన్నికల గడువులోగా కొన్ని ప్రాంతాలకే వెళ్లగలరు. అదే విమానమో, హెలికాప్టరో అయితే అనుకున్న చోటకు సులువుగా, తక్కువ సమయంలో చేరుకోవచ్చు. వీలైనన్ని బహిరంగ సభల్లో ప్రసంగించొచ్చు. కార్లు, బస్సులు వెళ్లలేని మారుమూల ప్రాంతాలకూ వెళ్లొచ్చు. అందుకే ఇప్పటికే జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు హెలికాప్టర్లు బుక్​ చేసేసుకున్నారు.

వేగం.. ఎత్తు

పౌర హెలికాప్టర్లు దాదాపు గంటకు 100 నుంచి 140 నాటికల్​ మైళ్ల వేగంతో ప్రయాణించగలవు. దాదాపు భూమి నుంచి రెండు నుంచి మూడు వేల అడుగుల ఎత్తులో ఎగురుతాయి. ఇలాంటి సదుపాయాలున్న వాటికే ప్రాధాన్యమిస్తున్నారు రాజకీయ నేతలు.

దేశంలో ఎన్నికల ప్రచారం కోసం రాజకీయ నేతలకు కావాల్సినన్ని హెలికాప్టర్లు అందుబాటులో లేవు. అందుకే వాటి కొరత ఏర్పడింది.

ఖర్చెంత..?

" హెలికాప్టర్​ వాడాలంటే వాటి మోడల్​ను బట్టి గంటకు రూ.75వేల నుంచి రూ.3లక్షల 50వేల వరకు అద్దె చెల్లించాల్సిందే. వాడినా వాడకున్నా హెలికాప్టర్​ను బుక్​ చేసుకున్నవారు కనీసం రోజుకు మూడు గంటల అద్దె కట్టాల్సిందే. హెలికాప్టర్​ ఇచ్చే సంస్థతో ఇలా ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. "

-- ప్రదీప్​ థాంపీ, విమానయాన నిపుణుడు, ముంబయి

దేశంలో హెలికాప్టర్ల సంఖ్య

దేశంలో మొత్తం పౌర హెలికాప్టర్లు 275 ఉన్నాయి. అందులో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలవి పోగా 75 మాత్రమే అద్దెకు అందుబాటులో ఉన్నాయి. యూరోకాప్టర్​, రాబిన్​సన్​, బెల్​, సికోర్​స్కై తదితర కంపెనీల హెలికాప్టర్లన్నీ ప్రచారం కోసం ఇప్పటికే బుక్​ అయిపోయాయి.

" ఒక పైలట్​తో పాటు ఐదురుగు ప్రయాణించే వీలున్న ఎయిర్​ సీ-90, ఇద్దరు పైలట్లు 8 మంది ప్రయాణించగల ​ బి-200 చిన్న విమానాలకు మంచి డిమాండ్​ ఉంది. దేశంలో అవి 24 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు అందుబాటులో లేవు. మే మూడో వారం వరకు అన్ని బుకింగ్​లు అయిపోయాయి"

-- ప్రదీప్​ థాంపీ, విమానయాన నిపుణుడు, ముంబయి

ఒక ఇంజిన్​తో నడిచే సెస్నా వంటి హెలికాప్టర్లను వాడడం లేదని, రెండు ఇంజిన్ల టర్బోప్రాప్స్​లకు విపరీతమైన డిమాండ్​ ఉందని చెప్పారు థాంపీ.

భాజపా నేతలే అధికం

రాజకీయ పార్టీల నేతలు 45 నుంచి 60 రోజులకు హెలికాప్టర్లు బుక్ చేసుకున్నారని చెప్పారు థాంపీ. ఇందులో 50శాతం అధికార భాజపా నేతలేనని తెలిపారు. రోజుకు దాదాపు మూడు గంటలు వాటిని వాడుతున్నారని అంచనా వేశారు.

అగ్రనేతలైతే...

భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్​ షా, కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ లాంటి అగ్రనేతలు భద్రతా కారణాల దృష్ట్యా ఎక్కువ దూరం హెలికాప్టర్లలో ప్రయాణించరు. ప్రచారం చేయాల్సిన ప్రాంతానికి దగ్గర్లోని విమానాశ్రయం వరకు విమానంలో వెళ్లి అక్కడి నుంచి హెలికాప్టర్​​ లేదా చిన్న విమానాల్లో ప్రయాణిస్తారు.

ABOUT THE AUTHOR

...view details