తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గవర్నర్ కోషియారీ​ చేతిలో 'మహా' భవిష్యత్తు! - CONGRESS NCP

మహా ప్రతిష్టంభనలో గవర్నర్​ కీలక పాత్ర పోషించే అవకాశముందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ స్థాపనకు ఏ పార్టీని ఆహ్వానించాలి, ఎవరికి ఎంత సమయమివ్వాలనే విషయాల్లో గవర్నర్​దే తుది నిర్ణయమని తెలిపారు. అన్ని సమీకరణాలు పరిశీలించినప్పటికీ స్థిర ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేకపోతే రాష్ట్రపతి పాలన తథ్యమని స్పష్టం చేశారు.

గవర్నర్ కోషియారీ​ చేతిలో 'మహా' భవిష్యత్తు!

By

Published : Nov 11, 2019, 2:04 PM IST

Updated : Nov 11, 2019, 4:59 PM IST

మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. భాజపాతో మైత్రి తెగదెంపులు చేసుకున్న శివసేన... ఎన్​సీపీ-కాంగ్రెస్​ కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్​ భగత్​ సింగ్​ కోషియారీ కూడా కీలక పాత్ర పోషించే అవకాశముందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తన విచక్షణతో అన్ని సమీకరణాలు పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ ఏర్పాటులో కీలక నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్​కు ఉందని అంటున్నారు. అన్ని సమీకరణాలు విఫలమైతే తప్ప... రాష్ట్రపతి పాలనకు గవర్నర్​ మొగ్గు చూపే అవకాశం లేదని చెబుతున్నారు.

రాష్ట్రంలో స్థిరమైన అధికారం ఉండటమే గవర్నర్​ ప్రధాన లక్ష్యమని అలహాబాద్​ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత కాంగ్రెస్​ నేత జస్టిస్ అభయ్​ థిప్సే అభిప్రాయపడ్డారు. ప్రతిష్టంభన పరిస్థితుల్లో.. గవర్నర్​ అనుసరించాల్సిన పద్ధతులపై రాజ్యాంగంలో ఎలాంటి నియమాలు లేవని గుర్తు చేశారు.

"సాధారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అతిపెద్ద పార్టీని గవర్నర్​ ఆహ్వానిస్తారు. వాళ్లు సిద్ధంగా లేకపోతే.. తర్వాతి స్థానంలో ఉన్న పార్టీని పిలుస్తారు. అధికారం చేపట్టడానికి పార్టీలకు ఎంత సమయం ఇవ్వాలనేది గవర్నర్​ ఇష్టం."
--- జస్టిస్ అభయ్​ థిప్సే, అలహాబాద్​ హైకోర్టు మాజీ జడ్జి.

అయితే పొత్తుతో ఎన్నికల బరిలో దిగిన పార్టీలను పిలిచి... 'ఒక్క పార్టీగా' కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఇరు పక్షాల నేతలకు పిలుపునిచ్చే అధికారమూ గవర్నర్​కు ఉందని గుర్తుచేశారు జస్టిస్​ అభయ్.

మహా మలుపులు...

తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు కాషాయ దళానికి అవకాశమిచ్చారు భగత్​ కోషియారీ​. శివసేన మద్దతు లేకపోవడం వల్ల భాజపా చేతులెత్తేసింది. అనంతరం... శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. శివసేన కుడా విఫలమైతే ఎన్​సీపీ(మూడో అతిపెద్ద పార్టీ)ని పిలవడం, లేకపోతే భాజపా-సేన నేతలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించడం.. గవర్నర్​ ముందున్న మరిన్ని ప్రత్యామ్నాయాలు. ఇవన్నీ విఫలమైతే.. మిగిలింది రాష్ట్రపతి పాలనే.

Last Updated : Nov 11, 2019, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details