తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఝార్ఖండ్​ ఎన్నికల్లో జేఎంఎం 43, కాంగ్రెస్​ 31చోట్ల పోటీ! - telugu national political news

వచ్చే జార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై ప్రతిపక్ష కూటమి ఓ కొలిక్కి వచ్చింది. ఝార్ఖండ్​ ముక్తి మోర్చా43సీట్లు, కాంగ్రెస్​ 31, ఆర్డేడీ 7 స్థానాల్లో పోటీ చెయనున్నాయి. జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్​ సొరెన్​ ముఖ్యమంత్రి అభ్యర్థిగా.. ఆయన అధ్యక్షతన ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆర్పీఎన్​ సింగ్​ వెల్లడించారు.

జార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమంతా ఒక పక్షం

By

Published : Nov 9, 2019, 5:31 AM IST

ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సీట్లు పంచుకునే విషయంలో ప్రతిపక్ష కూటమి ఓ నిర్ణయానికి వచ్చింది. పంపకాల ప్రకారం ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా 43 స్థానాల్లో, కాంగ్రెస్‌ 31, ఆర్జేడీ 7 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఈ మేరకు ఏఐసీసీ జార్ఖండ్‌ ఇన్‌ఛార్జ్‌ ఆర్​పీఎన్​ సింగ్‌, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సొరెన్‌ అధికారిక ప్రకటన చేశారు.

హేమంత్‌ సొరెన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా.. ఆయన అధ్యక్షతన ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆర్​పీఎన్​ సింగ్‌ వెల్లడించారు. స్నేహాపూర్వక పోటీలు ఉండవని, కూటమి ప్రకటించిన అభ్యర్థిపై పోటీ చేస్తే సదరు సభ్యుడిపై సంబంధిత పార్టీ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 81 అసెంబ్లీ స్థానాలున్న ఝార్ఖండ్‌లో ఐదు విడతలుగా నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 20 వరకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 23న ఫలితాలు వెలువడుతాయి.

ఇదీ చూడండి: నోట్లరద్దు దేశంపై జరిగిన ఉగ్రదాడి: రాహుల్​ గాంధీ

ABOUT THE AUTHOR

...view details