తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అలర్ట్​: యూపీలో చొరబడిన ఇద్దరు ఐసిస్​ ఉగ్రవాదులు! - terrorists presence in UP

ఇద్దరు ఐసిస్​ ఉగ్రవాదులు ఉత్తర్​ప్రదేశ్​లోకి చొరబడ్డారు. వీరు ప్రస్తుతం నేపాల్​ పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు నిఘా సమాచారముందని పోలీసులు వెల్లడించారు. అందుకే ఈ ముష్కరులు తప్పించుకోకుండా భారత్​-నేపాల్​ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Alert along India-Nepal border after inputs of terrorists' presence in UP
అలర్ట్​: యూపీలో చొరబడిన ఇద్దరు ఐసీస్​ ఉగ్రవాదులు!

By

Published : Jan 5, 2020, 4:36 PM IST

Updated : Jan 5, 2020, 4:42 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోకి ఇద్దరుఐసిస్​ ఉగ్రవాదులు చొరబడినట్లు పోలీసులు వెల్లడించారు. వీళ్లు నేపాల్​ పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు నిఘావర్గాల సమాచారం ఉందని తెలిపారు. ముష్కరులు తప్పించుకోకుండా భారత్​-నేపాల్​ సరిహద్దుల్లోని మహారాజ్​గంజ్​, కుశినగర్​, సిద్ధార్థ్​ నగర్​ల్లో హై అలర్ట్​ ప్రకటించినట్లు స్పష్టం చేశారు.

"ఇద్దరు వాంటెడ్​ఐసిస్ ఉగ్రవాదులు అబ్దుల్​ సమద్​, ఇలియాస్​లు ఉత్తర్​ప్రదేశ్​లో చొరబడ్డారు. ఇక్కడ నుంచి వారు నేపాల్​ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం."- అశుతోష్​ కుమార్​, ఐజీ (బస్తీ రేంజ్​)

ఈ ఇద్దరు వాంటెడ్ ఉగ్రవాదులను గుర్తించేందుకుగాను వారిద్దరి చిత్రాలను భారత్​-నేపాల్​ సరిహద్దు ప్రాంతాల్లో విరివిగా పంపిణీ చేసినట్లు ఐజీ అశుతోష్​ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం ముష్కరులు ఎలాంటి దుస్తులు, వేషధారణలో ఉన్నారనే సమాచారం లేదని ఐజీ తెలిపారు.

బంగాల్​లో

ఇంతకుముందు ఈ ఇద్దరు ముష్కరులను బంగాల్​ సిలిగురిలో గుర్తించారు. పోలీసులు ఈ ఇద్దరినీఐసిస్​కు చెందిన ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు.

భారత్​-నేపాల్​ల మధ్య 1,751 కిలోమీటర్ల పొడవున సరిహద్దు ఉంది. దీనిలో ఉత్తర్​ప్రదేశ్​ 599.3 కి.మీ సరిహద్దు కలిగి ఉంది. లిపిభిత్​, లఖింపుర్​ ఖేరీ, బహ్రాయిచ్​, శ్రావస్తి, సిద్ధార్థ్​నగర్​, మహారాజ్​గంజ్​ జిల్లాలు నేపాల్​తో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఉగ్రవాదులను భారత్​లోకి పంపించడానికిగాను ఈ ప్రాంతాన్ని గతంలో పాకిస్థాన్ వినియోగించుకుంది. అయితే భారత్​ సరిహద్దు దళాలు పలువురు పాక్​ ఉగ్రవాదులను చాలాసార్లు పట్టుకున్నాయి.

ఇదీ చూడండి:సీఏఏపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: షా


Last Updated : Jan 5, 2020, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details