తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పసిబిడ్డ పదేపదే ఏడుస్తోందని గొంతుకోసేశాడు! - తల్లి

అతడు ఎప్పటిలాగే తాగి ఇంటికి వచ్చాడు. అదే సమయానికి ఏడాది వయస్సున్న కుమార్తె ఏడవడం మొదలు పెట్టింది. కోపంతో ఊగిపోయిన ఆ తండ్రి... పసిబిడ్డను దారుణంగా హత్యచేశాడు.

పసిబిడ్డ పదేపదే ఏడుస్తోందని గొంతుకోసేశాడు!

By

Published : Aug 4, 2019, 11:29 AM IST

తాగిన మైకంలో కన్న కుమార్తె ఏడుపు అతడికి కర్ణకఠోరంగా అనిపించింది. అంతే... పసికందును నిర్దాక్షిణ్యంగా గొంతు కోసి చంపేశాడు. మహారాష్ట్ర లాతూర్​​ జిల్లాలోని నలింగలో జరిగిందీ దారుణం.

ఇదీ జరిగింది

శివాజీ లాలే హోటల్​ నడుపుతున్నాడు. కొద్ది సంవత్సరాలుగా మద్యానికి బానిసైపోయాడు. ఆ మత్తులో శనివారం అతడు ఇంటికి వచ్చే సమయానికి ఏడాది వయస్సున్న కుమార్తె ఏడుపు మొదలు పెట్టింది. కోపంతో పసికందును హతమార్చాడు శివాజీ.

శివాజీపై అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details