పౌరసత్వ చట్ట సవరణ బిల్లు-2019కు వ్యతిరేకంగా అసోంవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. గువహటిలో సామాజిక కార్యకర్త అఖిల్ గొగొయి నేతృత్వంలోని కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి(కేఎంఎస్ఎస్) ఆధ్వర్యంలో బిల్లును నిరసిస్తూ 'రాజ్‌భవన్ ఛలో' కార్యక్రమాన్ని నిర్వహించారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ అసోం గవర్నర్‌కు తీర్మానాన్ని పంపారు. దీనిని రాష్ట్రపతికి చేరవేయాల్సిందింగా కోరారు అఖిల్. కేఎంఎస్ఎస్తో పాటు యూఎల్ఎఫ్ఏ నేతలు అనుప్ ఛెతియా, మృణాల్ హజారికా, మరో కార్యకర్త లచిత్ బోర్డోలోయి వేర్వేరుగా నిరసనలు చేపట్టారు.
"ఈ బిల్లుతో విదేశీయులు అసోంలోకి ప్రవేశిస్తారు. సుమారు 1.9 కోట్ల మంది హిందూ బంగ్లాదేశీయులు మా ఉద్యోగాలను పొందుతారు. ఫలితంగా అసలైన స్థానికుల్లో నిరుద్యోగం పెరుగుతుంది."