తెలంగాణ

telangana

By

Published : Nov 23, 2019, 10:48 AM IST

ETV Bharat / bharat

'ఆ నిర్ణయం నాది కాదు.. సర్కారుకు మా మద్దతు లేదు '

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్, డిప్యూటీ సీఎంగా ఎన్​సీపీ నేత అజిత్ పవార్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వం కొలువుదీరడంపై శరద్​ పవార్​ స్పందించారు. అజిత్​ది వ్యక్తిగత నిర్ణయమని.. ప్రభుత్వానికి తమ మద్దతు ఉండబోదని వ్యాఖ్యానించారు.

'అజిత్​ది వ్యక్తిగత నిర్ణయం-ప్రభుత్వానికి మద్దతిచ్చే సమస్యే లేదు'

మూడు పార్టీల మధ్య నేడు మరోదఫా చర్చలు జరుగుతాయనుకుంటున్న నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్, డిప్యూటీ సీఎంగా ఎన్​సీపీ నేత అజిత్​ పవార్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అజిత్‌ పవార్‌ వ్యక్తిగత నిర్ణయం అని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ అన్నారు. అజిత్‌ పవార్‌ నిర్ణయం పార్టీ నిర్ణయం కాదన్నారు. అజిత్‌ పవార్‌ని తాము సమర్థించడం లేదని ట్వీట్​ చేశారు.

పవార్​ ట్వీట్

"భాజపాకు మద్దతివ్వాలన్నది అజిత్ పవార్ వ్యక్తిగత నిర్ణయం. ఎన్​సీపీకి ఎలాంటి సంబంధమూ లేదు. ఆయన నిర్ణయానికి ఆమోదం, మద్దతు ఇవ్వబోం అని ప్రకటిస్తున్నాం."

-శరద్​ పవార్, ఎన్​సీపీ అధ్యక్షుడు

ఎన్​సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌ మాట్లాడుతూ.. భాజపాతో కలిసి నడవడం ఎన్సీపీ పార్టీ నిర్ణయం కాదన్నారు. దీనికి శరద్‌ పవార్‌ మద్దతు లేదని వెల్లడించారు.

మహారాష్ట్రలో అనూహ్య రీతిలో భాజపా అధికార పీఠం దక్కించుకుంది. తెల్లవారుజామునే రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. అనంతరం పరిణామాలు వేగంగా మారాయి.

ఇదీ చూడండి: 'మహా' ప్రతిష్టంభనకు తెర.. పీఠంపై మరోసారి ఫడణవీస్

ABOUT THE AUTHOR

...view details