ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ ప్రమోద్ కుమార్ జోగి 74 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఛత్తీస్‌గఢ్ మొదటి ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రానికి ఎంతో సేవ చేశారు. ఆయన జీవిత విశేషాలు మీకోసం..
బాల్యం.. చదువు
- 1946 ఏప్రిల్ 29న ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌లో అజిత్ జోగి జన్మించారు.
- మౌలానా ఆజాద్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో బీఈ (మెకానికల్) పూర్తి చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో బంగారు పతకం సాధించారు. ఆ సమయంలోనే విద్యార్థి సంఘం అధ్యక్షుడిగానూ ఉన్నారు.
- దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు.
కలెక్టర్‌గా రికార్డు..
- రాయ్‌పుర్‌లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్‌గానూ (1967-68) పనిచేశారు.
- మధ్యప్రదేశ్‌లో 12 ఏళ్లు సుదీర్ఘకాలం పాటు పనిచేసిన కలెక్టర్‌గా అజిత్ రోగి రికార్డు సృష్టించారు.
రాజకీయ జీవితం
- అజిత్ జోగి తన రాజకీయ జీవితాన్ని 1986లో ఏఐసీసీ సభ్యుడిగా ప్రారంభించారు.
పదవులు
- 1987లో (మధ్యప్రదేశ్) ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
- సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ, అటవీ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు.
కాంగ్రెస్ ఛాప్టర్-1
- 1995లో సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ అబ్జర్వర్‌గా పనిచేశారు.1996 పార్లమెంటరీ ఎన్నికల సమయానికి ఏఐసీసీ కోర్ గ్రూప్ సభ్యుడయ్యారు.