తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విమానాల్లో ప్రయాణికుల సామర్థ్యం పెంపు

దేశీయ విమానాలలో ప్రయాణికుల సామర్థ్యాన్ని 45శాతం నుంచి 60 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణానికి డిమాండ్​ పెరిగిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ.

By

Published : Sep 2, 2020, 8:24 PM IST

Airlines allowed to deploy up to 60% capacity in domestic sector
విమానాల్లో 60 శాతానికి సామర్థ్యం పెంచుతూ కేంద్రం నిర్ణయం

దేశీయ విమానాల్లో ప్రయాణికుల సామర్థ్యాన్ని 45శాతం నుంచి 60శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఈ మేరకు విమానయాన మంత్రిత్వశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దేశీయంగా విమాన ప్రయాణానికి డిమాండ్​ పెరగడం వల్ల.. ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

కరోనా వ్యాప్తి కారణంగా మార్చి 25న తాత్కాలికంగా నిలిపివేసిన విమాన ప్రయాణాలు.. మే 25న పునఃప్రారంభమయ్యాయి. అనంతరం జూన్ 27 నుంచి కేవలం 45శాతం ప్రయాణికుల సామర్థ్యం ఉండేలా చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనిని మార్చుతూ తాజా ఉత్తర్వులు ఇచ్చింది మంత్రిత్వ శాఖ.

ఇదీ చూడండి'సౌదీ చారిత్రక నిర్ణయం.. అన్ని దేశాల విమానాలకు అనుమతి'

ABOUT THE AUTHOR

...view details