తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎయిర్​సెల్​ కేసులో చిదంబరానికి స్వల్ప ఊరట - CBI

ఎయిర్​సెల్​ మ్యాక్సిస్​ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్​పై తీర్పును సెప్టెంబరు 3కు వాయిదా వేసింది దిల్లీ కోర్టు. ఈ కేసు విచారణ వాయిదా వేయాలనే సీబీఐ,ఈడీ అభ్యర్థనలపై అసహనం వ్యక్తం చేసింది.

సీబీఐ,ఈడీల పిటిషన్​పై తీర్పు వాయిదా

By

Published : Aug 23, 2019, 7:20 PM IST

Updated : Sep 28, 2019, 12:39 AM IST

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపై ఉన్న ఎయిర్​సెల్​ మ్యాక్సిస్​ కేసు విచారణ వాయిదా వేయడం కుదరదని సీబీఐ, ఈడీ సంస్థలకు చెప్పింది దిల్లీ కోర్టు.

వీరిద్దరితో సంబంధమున్న ఐఎన్​ఎక్స్ మీడియా కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున ఈ కేసును వాయిదా వేయాలని సీబీఐ, ఈడీ దిల్లీ కోర్టును అభ్యర్థించాయి.

గత ఏడాది కాలంగా ఇవే కారణాలు పదే పదే వినడం ఇబ్బందికరంగా ఉందని సీబీఐ,ఈడీలపై అసహనం వ్యక్తం చేశారు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ ఓపీ సైనీ. చిదంబరం ముందస్తు బెయిల్​ పిటిషన్​పై తీర్పును సెప్టెంబరు 3కు వాయిదా వేశారు. అప్పటివరకు చిదంబరం, ఆయన కుమారుడు కార్తీలకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణను పొడిగించారు.

సెప్టెంబరు 3లోగా సీబీఐ, ఈడీలు ఎప్పుడైనా తమ వాదనలను వినిపించవచ్చని తెలిపింది దిల్లీ కోర్టు. ఎయిర్​సెల్ మ్యాక్సిస్​ కేసు, ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులు విభిన్నమని చెప్పింది. ఈ రెండు కేసులకు విదేశీ పెట్టుబడులు ప్రోత్సాహక బోర్డు (ఎఫ్​ఐపీబీ) అనుమతులతో సంబంధం ఉందని సీబీఐ, ఈడీ వాదించగా.. అలాంటి విషయాలు వందల సంఖ్యలో ఉంటాయని దిల్లీ కోర్టు వ్యాఖ్యానించింది.

ఇదీ చూడండి: ఐఎన్​ఎక్స్​ స్కామ్: ఈడీ కేసులో చిదంబరానికి ఊరట

Last Updated : Sep 28, 2019, 12:39 AM IST

ABOUT THE AUTHOR

...view details