ఫిబ్రవరి 26న భారత వాయుసేన బాలాకోట్ ఉగ్రస్థావరాలపై చేసిన దాడుల్లో సుమారు 300 వందల మంది మృతి చెందినట్లు అంచనా వేసింది జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ( ఎన్టీఆర్ఓ). వైమానిక దాడికి ముందు ఘటనా స్థలి నుంచి 300 ఫోన్ నెంబర్లు సిగ్నళ్లు అందుకున్నాయన్న సాంకేతిక సమాచారం ఆధారంగా ఈ నిర్ధరణకు వచ్చింది.
లెక్క తేలింది..! - ఫోన్ల సిగ్నళ్లు
ఫిబ్రవరి 26 నాటి భారత వాయుసేన దాడుల్లో సుమారు 300 మంది మృతి చెందినట్లు జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ అంచనా వేసింది. వైమానిక దాడికి ముందు అక్కడ 3 వందల ఫోన్లు సిగ్నళ్లు అందుకున్నాయని తేల్చింది.
వైమానిక దాడిలో మూడువందలమంది మృతిపై ఎన్టీఆర్ఓ అంచనా
భారత వాయుసేనకు చెందిన 12 మిరాజ్ యుద్ధ విమానాలు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి వెళ్లి దాడులు చేశాయి. ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారన్న విషయంపై పాకిస్థాన్ అధికారిక ప్రకటన ఏదీ విడుదల చేయలేదు.
వైమానిక దాడికి ముందు వరకు 300 ఫోన్లకు సిగ్నళ్లు అందాయని సాంకేతిక నిఘా ఆధారంగా కనిపెట్టినట్లు ఓ అధికారి స్పష్టం చేశారు.