తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దొంగతనం ఆరోపణలతో ఎయిరిండియా పైలట్​పై వేటు

సిడ్నీ విమానాశ్రయంలోని ఓ దుకాణంలో వాలెట్​ దొంగతనం చేశారనే ఆరోపణలపై.. ఎయిర్​ ఇండియా పైలట్​ను సస్పెండ్ చేసింది. సస్పెండ్​ అయిన కమాండర్​ రోహిత్​ భాసిన్​ జూన్​ 22న సిడ్నీ విమానాశ్రయం నుంచి దిల్లీకి పయనించిన విమానానికి పైలట్​గా వ్యవహరించారు.

By

Published : Jun 23, 2019, 7:53 PM IST

వాలెట్​ దొంగతనంపై పైలట్​ సస్పెండ్..!

ఎయిర్​ ఇండియా తూర్పు ప్రాంత డైరెక్టర్​ కెప్టెన్​ రోహిత్​ భాసిన్​పై సస్పెన్షన్​ వేటు పడింది. సిడ్నీ విమానాశ్రయంలోని ఓ దుకాణంలో దొంగతనం చేశారనే ఆరోపణలే కారణం.

జూన్​ 22న సిడ్నీ నుంచి దిల్లీ ప్రయాణించిన AI301 విమానానికి రోహిత్​ పైలట్​గా విధులు నిర్వర్తించారు. విమానం టేకాఫ్​ అయ్యే ముందు విమానాశ్రయంలోని ఓ దుకాణంలో రోహిత్​ వాలెట్​ దొంగతనం చేసినట్లు ఫిర్యాదు వచ్చింది. ఈ విషయంపై ఎయిర్​ ఇండియా దర్యాప్తునకు ఆదేశించింది. దర్యాప్తు సాగుతోన్న నేపథ్యంలో ఆయనను సస్పెండ్​ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఎయిర్​ ఇండియా ఉద్యోగులు నిబద్ధత, సరైన ప్రవర్తన కలిగి ఉండేలా సంస్థ చూస్తుందని.. ఎటువంటి చిన్న తప్పిదాన్నైనా క్షమించబోదని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details