సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో గగనతలాన్ని మరింత కట్టుదిట్టం చేసే దిశగా చర్యలు చేపట్టింది భారత వాయుసేన. చైనా, పాకిస్థాన్ సరిహద్దులు సహా దేశంలోని కీలక కమాండ్లకు నూతన అధికారులను నియమించింది. లద్దాఖ్ సహా రాజస్థాన్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాలను పర్యవేక్షించే దిల్లీ పశ్చిమ వైమానిక విభాగ బాధ్యతలను ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరికి అప్పగించింది. ఆగస్టు 1న ఆయన నూతన బాధ్యతలు స్వీకరించనున్నారు. 9 నెలలుగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎయిర్ మార్షల్ సురేశ్ స్థానాన్ని వివేక్ భర్తీ చేయనున్నారు.
షిల్లాంగ్‌లోని తూర్పు కమాండ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎయిర్ మార్షల్ ఆర్డీ మాథుర్‌ను.. బెంగళూరులోని వైమానిక శిక్షణ కేంద్రానికి బదిలీ చేసింది. అక్టోబరు 1నుంచి ఆయన అక్కడ విధులు నిర్వహిస్తారు. తూర్పు కమాండ్‌కు మాథుర్ స్థానంలో ఎయిర్ మార్షల్ అమిత్ దేవ్‌ను నియమించింది. సిక్కిం-హిమాచల్ ప్రదేశ్ మధ్య చైనా సరిహద్దు సహా.. ఈశాన్య ప్రాంతం మొత్తాన్ని తూర్పు కమాండ్ అధికారి పర్యవేక్షిస్తారు.