దేశంలోని ప్రతి వైద్యుడు.. కరోనా చికిత్సపై అవగాహన పొందే విధంగా దిల్లీ ఎయిమ్స్ చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ, నీతి ఆయోగ్ సహకారంతో.. "నేషనల్ క్లినికల్ గ్రాండ్రౌండ్స్ ఆన్ కొవిడ్-19" అనే జాతీయ వేదికను బుధవారం ప్రారంభించనుంది.
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. బాధితులకు తాము అందించిన చికిత్స వివరాలను వైద్యులు పంచుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు డా. వీకే పాల్ తెలిపారు.
"ఇది దేశనలుమూల్లో ఉన్న వైద్యులకు ఉపయోగపడుతుంది. మారుమూల గ్రామంలో ఉన్నా కూడా ఈ వేదికను వినియోగించుకుని కరోనా బాధితుల చికిత్సపై శిక్షణ పొందవచ్చు. ఇందుకు వైద్యులు covid.aiims.edu/cgrలో లాగిన్ అవ్వాలి. ఇందులో ఎయిమ్స్‌తో పాటు ప్రైవేటు రంగానికి చెందిన నిపుణులు కూడా ఉంటారు."