తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ విద్యార్థులకు పూర్తి ఫీజు రీఫండ్​: ఏఐసీటీఈ - ఏఐసీటీఈ

కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్​ 10లోపు అడ్మిషన్లను ఉపసంహరించుకునే విద్యార్థులకు పూర్తి ఫీజును వెనక్కి తిరిగిచ్చేయాలని.. ఏఐసీటీఈ తన అనుబంధ సంస్థలకు తెలిపింది. దీనితో పాటు సర్టిఫికెట్లను కూడా ఇచ్చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్​ను జారీ చేసింది.

AICTE directs Institutes to refund full-fees to students who withdraw Admission before 10th November
పూర్తి ఫీజు వెనక్కిచ్చేయండి: ఏఐసీటీఈ

By

Published : Sep 2, 2020, 4:40 PM IST

ఈ ఏడాది నవంబర్​ 10లోపు.. తమ అడ్మిషన్లను ఉపసహరించుకునే విద్యార్థులకు పూర్తి ఫీజు రీఫండ్​ చేయాలని.. అనుబంధ సంస్థలను ఆదేశించింది అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ). ఈ పూర్తి ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను జారీ చేసింది.

"2020 నవంబర్​ 10లోపు అడ్మిషన్లు ఉపసంహరించుకుంటే.. ప్రాసెసింగ్​ ఫీజు(రూ.1000) మినహా విద్యార్థుల నుంచి సేకరించిన పూర్తి రుసుమును తిరిగి ఇచ్చేయాలి."

--- ఏఐసీటీఈ నోటిఫికేషన్​.

దీనితో పాటు విద్యార్థుల సర్టిఫికెట్ల పత్రాలను కూడా వెనక్కి తిరిగిచ్చేయమని ఆదేశించింది ఏఐసీటీఈ.

కరోనా సంక్షోభాన్ని పరిగణలోకి తీసుకుని.. అనుబంధ సంస్థలు అందించే ఎమ్​బీఏ, పీడీజీఎమ్​ కోర్సులకు కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది. డిగ్రీ పరీక్షల ద్వారా సీట్లను భర్తీ చేయాలని ఆదేశించింది. పారదర్శకత ఉండేలా పరీక్షలకు సంబంధించిన మెరిట్​ లిస్టును రూపొందించాలని స్పష్టం చేసింది. అయితే.. సీట్ల కేటాయింపులో ప్రవేశపరీక్షలు రాసిన విద్యార్థులకే(ఏదైనా రాష్ట్రంలో ఈ పరీక్షలు జరిగి ఉంటే) తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది.

ఇదీ చూడండి:- డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంబీఏ సీటు

ABOUT THE AUTHOR

...view details