తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అహ్మదాబాద్​లో మెట్రో వచ్చింది - మెట్రో

గుజరాత్​లోని అహ్మదాబాద్​ మెట్రో మొదటి దశను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. మొదటిసారిగా అందులో ప్రయాణించారు మోదీ. అనంతరం రెండో దశ మెట్రోకు సైతం ప్రధాని శంకుస్థాపన చేశారు.

అహ్మదాబాద్​ మెట్రోరెల్​ను ప్రారంభిస్తున్న మోదీ

By

Published : Mar 4, 2019, 9:37 PM IST

గుజరాత్ అహ్మదాబాద్​ ప్రజల మెట్రో కల సాకారమైంది. మొదటి దశ మెట్రో మార్గాన్ని ప్రధాని నరేంద్రమోదీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అహ్మదాబాద్​ మెట్రోలో ప్రయాణించారు మోదీ. రెండో దశ పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

అహ్మదాబాద్​ మెట్రోరెల్​ను ప్రారంభిస్తున్న మోదీ

ప్రస్థుతానికి వస్త్రాల్​ నుంచి అప్పరెల్ పార్క్ మధ్య మొత్తం 6.5 కిలోమీటర్ల దూరం మాత్రమే అందుబాటులోకి వచ్చింది. 40 కిలోమీటర్ల మొదటిదశలో పూర్తయిన ఈ 6.5కి.మీ మార్గం మాత్రమే ప్రారంభించారు.

మొదటి దశ

రెండు కారిడార్లు: వస్త్రాల్ నుంచి థాల్తేజ్ ఘామ్, గ్యాసాపూర్​ డిపో నుంచి మొతెరా మైదానం

మొత్తం: 40కిలోమీటర్లు

అండర్​గ్రౌండ్​: 6.5 కిలోమీటర్లు

ఆకాశమార్గం: 33.5కిలోమీటర్లు

రెండో దశ నిర్మాణానికి 2019 ఫిబ్రవరిలో కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. మొతెరా క్రికెట్​ మైదానం నుంచి గాంధీనగర్​లోని మహాత్మ మందిర్​ వరకు మొత్తం 28కిలోమీటర్లతో రెండో దశ ప్రణాళిక రూపొందించారు.

ABOUT THE AUTHOR

...view details