తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా టెస్టుల్లో దూకుడేది? ఇలా అయితే కష్టమే'

పరీక్షల నిర్వహణలో దూకుడు చూపించకపోతే.. కరోనా విసురుతున్న సవాళ్లను దేశం ఎదుర్కోలేదని వ్యాఖ్యానించారు మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్. పరీక్షలు చేయడం, రోగుల జాడ గుర్తించడం కొవిడ్​పై పోరులో కీలకమని కాంగ్రెస్​ పార్టీ విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు మన్మోహన్​.

Aggressive testing key to fight battle against COVID-19
'కరోనా టెస్టుల్లో దూకుడేది.. ఇలా అయితే కష్టమే'

By

Published : Apr 26, 2020, 1:27 PM IST

కరోనా వైరస్​ భారతదేశాన్ని కలవరపెడుతున్న వేళ.. మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్​ పరీక్షల నిర్వహణలో దూకుడు చూపించకపోతే.. వైరస్​ విసురుతున్న సవాళ్లను దేశం ఎదుర్కోలేదని హెచ్చరించారు. ఈ మేరకు కాంగ్రెస్​ పార్టీ విడుదల చేసిన వీడియోలో మాట్లాడారు సింగ్​.

''కొవిడ్​ పరీక్షల నిర్వహణలో ఎన్నో సమస్యలున్నాయి. మరింత దూకుడుగా టెస్టులు నిర్వహించకుంటే.. ఈ మహమ్మారిని ఎదుర్కోలేం.''

- మన్మోహన్​ సింగ్​, మాజీ ప్రధాని

పరీక్షలు చేయడం, రోగుల జాడ కనుక్కోవడమే కరోనాపై విజయానికి కీలకమని వ్యాఖ్యానించారు మన్మోహన్​.

కమిటీ సభ్యులతో వీడియో..

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశంలో లాక్​డౌన్ అమలుతో. క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే పలు సమస్యల పరిష్కారానికి మన్మోహన్​ సింగ్​ నేతృత్వంలో కాంగ్రెస్​ ఓ సంప్రదింపుల కమిటీని నియమించింది. ఈ కమిటీ సభ్యులంతా తమ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. వీటినే వీడియో రూపంలో పొందుపరిచిన కాంగ్రెస్​.. ఇవాళ విడుదల చేసింది.

వలస కూలీల సమస్యల పరిష్కారంలో మానవతావాదం, రక్షణ, ఆర్థిక భద్రత కీలకమని కొందరు కాంగ్రెస్ నేతలు సూచించారు. వలసవాదుల రక్షణ కోసం.. విస్తృత కార్యచరణ అవసరమని అభిప్రాయపడ్డారు అగ్రనేత రాహుల్​ గాంధీ.

'ప్రభుత్వం విఫలం'

కరోనాపై పోరులో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​. దేశ ప్రజల రక్షణ కోసం... తామంతా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వ్యాఖ్యానించారు.

చివరగా.. చర్చలు, సంభాషణల ద్వారా పరిష్కార మార్గం దొరుకుతుందని కాంగ్రెస్​ నమ్ముతున్నట్లు వీడియోలో పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details