సరిహద్దుల్లో చైనా, పాక్‌ల కారణంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది కేంద్రం. ఈ క్రమంలోనే హిమాచల్‌ప్రదేశ్‌లోని వ్యూహాత్మక అటల్ టన్నెల్‌ను పూర్తి చేసింది. అక్టోబరు 3న ప్రధాని నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం మరో వ్యూహాత్మక టన్నెల్ నిర్మాణంపైనా కేంద్రం దృష్టి సారించినట్లు సమాచారం.
శింకుల టన్నెల్..
దార్చా-నిమ్ము-పాదమ్ మీదుగా శింకులా టన్నెల్‌ను నిర్మించడానికి కేంద్రం ప్రణాళిక సిద్ధం చేస్తునట్లు తెలుస్తోంది. మనాలి నుంచి లేహ్ మీదుగా లద్దాఖ్ చేరుకోవాలంటే 700 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. శింకులా టన్నెల్ పూర్తయితే 178 కిలోమీటర్ల దూరం తగ్గిపోనుంది. కీలక సమయాల్లో భద్రత బలగాలు సరిహద్దులను చేరుకోవడానికి ఈ మార్గం ద్వారా సులభమవుతుంది.