తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐఎన్​ఎక్స్​ కేసు: 55 రోజులుగా కస్టడీలోనే చిదంబరం - chidambaram arrest by ed

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత చిదంబరానికి ఇప్పట్లో చిక్కులు తప్పేలా లేవు. ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో ఆరోపణలతో సీబీఐ ఆయనను ఆగస్టు 21న అరెస్టు చేసింది. 55 రోజులుగా కస్టడీలోనే ఉన్నారు. తాజాగా ఈడీ పిటిషన్​పై దిల్లీ కోర్టు తీర్పు నేపథ్యంలో చిదంబరాన్ని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అదుపులోకి తీసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు నేడు చిదంబరాన్ని ప్రశ్నించనున్నారు. అనంతరం.. అరెస్టు చేసే అవకాశాలున్నాయి.

'ఐఎన్​ఎక్స్​ కేసు': 55 రోజులుగా కస్టడీలోనే చిదంబరం

By

Published : Oct 16, 2019, 5:22 AM IST

Updated : Oct 16, 2019, 3:31 PM IST

55 రోజులుగా కస్టడీలోనే కాంగ్రెస్​ నేత చిదంబరం

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో అవినీతి ఆరోపణలతో అరెస్టయిన కాంగ్రెస్​ సీనియర్​ నేత చిదంబరం... మరికొన్ని రోజులు కస్టడీలోనే ఉండే అవకాశముంది. ఆయన సీబీఐ కస్టడీ అక్టోబర్​ 17తో ముగుస్తున్నప్పటికీ తాజాగా మరో ఉచ్చు బిగుసుకుంది.

విచారణ నిమిత్తం చిదంబరం అరెస్టుకు అనుమతించేలా ఆదేశాలివ్వాలని దిల్లీ కోర్టును ఆశ్రయించిన ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​కు మంగళవారం అనుకూలంగా తీర్పు వచ్చింది. చిదంబరాన్ని విచారించేందుకు అనుమతినిచ్చింది న్యాయస్థానం. తాజా తీర్పు నేపథ్యంలో ఈడీ అధికారులు... కాంగ్రెస్​ నేతను బుధవారం తిహార్​ జైలులో ప్రశ్నించనున్నారు. అనంతరం.. అరెస్టు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

తొలుత అరెస్టు చేసి విచారణ జరుపుతామని కోర్టునుఈడీ అభ్యర్థించగా.. అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. మొదటగా దర్యాప్తు చేసి... అవసరమైతే అరెస్టు చేయవచ్చని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​కు సూచించింది దిల్లీ కోర్టు.

ఇప్పటికే ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో సీబీఐ చిదంబరాన్ని ఆగస్టు 21న అరెస్టు చేసింది. అనంతరం... 15 రోజుల పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ కస్టడీలోనే ఉన్నారు. ఆపై జ్యుడీషియల్​ కస్టడీ నిమిత్తం తిహార్​ జైలుకు తరలించారు. ఆ గడువు అక్టోబర్​ 17తో ముగియనుంది. అంటే మొత్తంగా... అరెస్టయిన దగ్గర నుంచి మంగళవారం వరకు చిదంబరం 55 రోజుల పాటు సీబీఐ, జ్యుడీషియల్​ కస్టడీలోనే గడిపారు.

సీబీఐ కేసులో...

మరోవైపు సీబీఐ కేసులో బెయిల్​ ఇవ్వాలంటూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. చిదంబరానికి బెయిల్​ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు కపిల్​ సిబల్​, అభిషేక్​ మను సింఘ్వీ వాదించారు. చిదంబరాన్ని కస్టడీలో ఉంచుకొని అవమానించాలని సీబీఐ భావిస్తోందన్నారు.

ఈ విషయంపై సోలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా నేడు సీబీఐ తరఫున వాదనలు వినిపించనున్నారు.

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో ఆరోపణలు

యూపీఏ హయాంలో 2004-14 మధ్యలో కేంద్ర హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు చిదంబరం.

చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్​ఎక్స్​ మీడియా గ్రూపు రూ. 305 కోట్ల విదేశీ నిధులను అక్రమంగా పొందిందన్న ఆరోపణలతో 2017 మే 15న సీబీఐ ఛార్జీషీట్​ దాఖలు చేసింది. అనంతరం ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

Last Updated : Oct 16, 2019, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details