తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వందేభారత్​' రైలులో విమాన తరహా సేవలు - Vande Bharat

దిల్లీ - వారణాసి మధ్య నడుస్తోన్న 'వందేభారత్​ ఎక్స్​ప్రెస్'​ ప్రయాణికులకు అత్యాధునిక సేవలందిస్తోంది. విమాన తరహా సౌకర్యాలను తక్కువ ధరలకే అందిస్తూ.. ప్రతి ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.

'వందేభారత్​' రైలులో విమాన తరహా సేవలు

By

Published : Aug 9, 2019, 5:21 AM IST

మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 'వందేభారత్​ ఎక్స్​ప్రెస్'​ ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తక్కువ ధరకే విమాన తరహా అత్యాధునిక సౌకర్యాలు అందిస్తోంది.

విలాసవంతమైన సీట్లు, సౌకర్యవంతమైన ప్రయాణం అయినందున వందేభారత్​లో ప్రయాణించేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సాహం చూపుతున్నారు. ఈ ఏడాది జనవరి 27న ఈ ట్రైన్​కు వందేభారత్​ ఎక్స్​ప్రెస్​గా నామకరణం చేశారు. దీన్నే ట్రైన్​ 18 అని కూడా పిలుస్తారు. 'మేక్​ ఇన్​ ఇండియా'లో భాగంగా చెన్నైలోని ఇంటిగ్రల్​ కోచ్​ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్​) ఈ సెమీ హై స్పీడ్​ రైలును నిర్మించింది.

ఈ ఏడాదే సేవలు..

దిల్లీ - వారణాసి (758 కిలోమీటర్లు) మధ్య నడిచే వందేభారత్​ రైలును ఈ ఏడాది ఫిబ్రవరి 15న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. అయితే రెండు రోజుల అనంతరం ఫిబ్రవరి 17న తొలిసారి సేవలు ప్రారంభమయ్యాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ వందేభారత్ ఎక్స్​ప్రెస్​​.. కాన్పూర్​, అలహాబాద్​ మీదుగా గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. గంటకు 180 కిలోమీటర్లు ఈ రైలు గరిష్ఠ వేగం. దాదాపు 377 మీటర్లు పొడవున్న వందేభారత్​లో మొత్తం 16 బోగీలుంటాయి. ఒకేసారి 1,128 మంది దాకా ప్రయాణించొచ్చు. ఇందులో రెండు ఏసీ బోగీలు కూడా ఉంటాయి. ప్రయాణ సౌలభ్యం కోసం రైలుకు ఇరువైపులా డ్రైవర్​ కోచ్​లుంటాయి.

ఈ ఏడాదిలోనే 'దిల్లీ - వైష్ణోదేవీ కాట్రా' మధ్య మరో రైలును ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details