తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాష్ట్రంలోకి వచ్చిన ఆ లక్ష మంది క్వారంటైన్​కే'

వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రత్యేక బస్సుల్లో వారందరినీ తరలించేందుకు సిద్ధమైంది. మరోవైపు.. రాష్ట్రానికి తిరిగివచ్చిన దాదాపు లక్ష మందిని క్వారంటైన్​లో ఉంచాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. వారందరి వివరాలను జిల్లా మేజిస్ట్రేట్ వద్ద నమోదు చేయాలని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లోని యూపీ ప్రజల సౌకర్యార్థం నోడల్ అధికారులను నియమించారు.

Adityanath directs for
'రాష్ట్రంలోకి వచ్చిన ఆ లక్ష మంది క్వారంటైన్​కే'

By

Published : Mar 29, 2020, 6:38 AM IST

Updated : Mar 29, 2020, 7:37 AM IST

'రాష్ట్రంలోకి వచ్చిన ఆ లక్ష మంది క్వారంటైన్​కే'

దేశవ్యాప్తంగా లాక్​డౌన్ నేపథ్యంలో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. తిరిగి స్వస్థలాలకు పయనమవుతున్నారు. దిల్లీ నుంచి వందలమంది వలస కూలీలు ఉత్తర్​ప్రదేశ్ వైపు కాలినడకన తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని గమనించిన ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం.. చర్యలకు పూనుకుంది. కూలీలను స్వస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేక బస్సులు నడుపేందుకు ముందుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న వలస కార్మికులు దిల్లీలోని ఆనంద్​ విహార్ బస్టాండ్​ ప్రాంగణానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫలితంగా బస్టాండ్ ప్రాంగణం మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది.

క్వారంటైన్​లో లక్ష మంది

వివిధ రాష్ట్రాల నుంచి ఉత్తర్​ప్రదేశ్​కు వచ్చిన దాదాపు లక్ష మందికి పైగా ప్రజలను క్వారంటైన్​లో ఉంచాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. గత మూడు రోజులుగా రాష్ట్రానికి వచ్చిన వారందరి పేర్లు, వివరాలు జిల్లా మేజిస్ట్రేట్​ వద్ద అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.

ఈ మేరకు సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి యోగి.. నిత్యవసరాల సరఫరాకు ఆటకం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. వలస వచ్చిన వారందరికీ ఆహారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. లాక్​డౌన్​ సమయంలో ఎవరూ ఆకలితో ఉండకూడదని స్పష్టం చేశారు.

లాక్​డౌన్​ను పాటించి ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని అభ్యర్థించారు యోగి. కరోనాపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన దేశాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని అన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఉత్తర్​ప్రదేశ్​ ప్రజల సహాయార్థం 12 రాష్ట్రాల్లో నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు.

హెల్ప్​లైన్​ ఏర్పాటు

కరోనా లక్షణాలు కనిపిస్తే సీఎం హెల్ప్​లైన్​ నంబర్ 1076కు కాల్ చేయాలని యూపీ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ తెలిపారు. నంబర్​కు కాల్​ చేసి వైద్య సలహాలు పొందవచ్చని స్పష్టం చేశారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన 60 వేల మంది ప్రజలను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:దేశంలో కరోనా కలకలం-ఒక్కరోజులో 179 కేసులు

Last Updated : Mar 29, 2020, 7:37 AM IST

ABOUT THE AUTHOR

...view details