సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు ఓం బిర్లాకు అభినందనలు తెలిపారు కాంగ్రెస్ లోక్సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరి. స్పీకర్ పదవి ఔన్నత్యాన్ని మరింత పెంచాలని కోరారు. ఈ పదవి సభకు సంరక్షక్షుడి వంటిదన్నారు అధిర్. చర్చ, భిన్నాభిప్రాయాల పై తమకు నమ్మకముందని... అయితే తమకు రావాల్సిన అవకాశాలను ఇవ్వాలన్నారు.
ఓం బిర్లాకు అభినందనలు తెలుపుతూ ఓ కవిత కూడా వినిపించారు అధిర్ రంజన్.