- రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై తొలగని సందిగ్ధం
- చెన్నై: మక్కళ్ మండ్రం జిల్లా కార్యదర్శులతో సమావేశమైన రజనీకాంత్
- రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఆర్ఎంఎం జిల్లా కార్యదర్శులతో భేటీ
- భేటీ ముగిశాక పోయెస్ గార్డెన్‌లోని నివాసానికి వెళ్లిన రజనీకాంత్
- పోయెస్ గార్డెన్‌లోని నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన రజనీకాంత్
- చెన్నై: వీలైనంత త్వరగా నిర్ణయం వెల్లడిస్తా: రజనీకాంత్
వీలైనంత త్వరగా నా నిర్ణయం చెప్తా: రజనీ
12:49 November 30
12:40 November 30
మక్కళ్ మండ్రం జిల్లా కార్యదర్శులతో భేటీ ముగిసిన తర్వాత రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. అభిమానులు ఓర్పుతో ఉండాలని రజనీ కోరారు. రాజకీయ రంగ ప్రవేశంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అయితే కార్యదర్శులు మాత్రం ఇదే సరైన సమయమని తలైవా రాజకీయాల్లోకి రావాలని కోరినట్లు సమాచారం.
12:31 November 30
- మక్కళ్ మండ్రం జిల్లా కార్యదర్శులతో ముగిసిన రజనీకాంత్ భేటీ
- రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఆర్ఎంఎం జిల్లా కార్యదర్శులతో భేటీ
- భేటీ ముగిశాక బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేసిన రజనీకాంత్
- చెన్నై: అనంతరం పోయెస్ గార్డెన్‌లోని నివాసానికి వెళ్లిన రజనీకాంత్
- చెన్నై: రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్ ప్రకటన చేసే అవకాశం
11:53 November 30
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఆయన నేడు 'రజనీ మక్కళ్ మండ్రం' నిర్వాహకులతో కీలకంగా భేటీ అయ్యారు. స్థానిక రాఘవేంద్ర కల్యాణ మండపంలో మక్కళ్ మండ్రం జిల్లా కార్యదర్శులతో రజనీ సమావేశమయ్యారు. రాజకీయ అరంగేట్రంపై చర్చించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశముంది. అంతకుముందు రజనీకాంత్ నివాసం ఎదుట అభిమానుల పోటెత్తారు. రజనీ రాజకీయాల్లోకి రావాలంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు.
తమిళనాడు శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రజనీ పార్టీ నిర్వాహకులతో సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయాల్లోకి వచ్చే విషయమై డిసెంబరు 12న ఆయన పుట్టినరోజు నాడు కీలక ప్రకటన వెలువడొచ్చనే ప్రచారం ఊపందుకుంది. రాబోయే ఎన్నికల్లో ఆయన కచ్చితంగా పోటీ చేస్తారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకోసమే తాజా సమావేశం ఏర్పాటు చేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు.
రజనీ రాజకీయ ప్రవేశంపై ఇప్పటికే పలుమార్లు ప్రచారం జరిగింది. తాను రాజకీయాల్లోకి వస్తానంటూ మూడేళ్ల క్రితమే ప్రకటించినా.. ఇప్పటివరకు పార్టీ ప్రారంభించలేదు. అటు క్రియాశీల రాజకీయాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. అయితే అదే సమయంలో మక్కళ్ మండ్రం బలోపేతానికి చర్యలు చేపట్టారు. జిల్లాలవారీగా నిర్వాహకులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మరి ఇప్పుడైనా పార్టీ గురించి ప్రకటిస్తారో లేదో చూడాలి..!
10:21 November 30
మక్కళ్ మండ్రం జిల్లా కార్యదర్శులతో రజనీకాంత్ భేటీ అయ్యారు. రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఆర్ఎంఎం జిల్లా కార్యదర్శులతో ఈ భేటీ జరుగుతోంది. రాజకీయ అరంగేట్రంపై చర్చించడానికే సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఇప్పటికే పలుమార్లు ప్రచారం జరిగింది. ఆర్ఎంఎం కార్యదర్శులతో చర్చించాక కొన్ని నిర్ణయాలు ఖరారు చేసే అవకాశం ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికలపై కూడా కీలక అంశాలను చర్చిస్తారని సమాచారం.
09:50 November 30
రాజకీయ రంగ ప్రవేశంపై రజనీకాంత్ కీలక భేటీ
కాసేపట్లో మక్కళ్ మండ్రం జిల్లా కార్యదర్శులతో రజనీకాంత్ భేటీ కానున్నారు. పోయెస్ గార్డెన్ నుంచి రాఘవేంద్ర కల్యాణ మండపానికి బయల్దేరారు రజనీకాంత్. రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఆర్ఎంఎం జిల్లా కార్యదర్శులతో భేటీ కానున్నారు. రాజకీయ అరంగేట్రంపై చర్చించడానికే సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఇప్పటికే పలుమార్లు ప్రచారం జరిగింది. ఆర్ఎంఎం కార్యదర్శులతో చర్చించాక కొన్ని నిర్ణయాలు ఖరారు చేసే అవకాశం ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికలపై కూడా కీలక అంశాలను చర్చిస్తారని సమాచారం