తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా కలవరం: దేశంలో 779కి పెరిగిన మరణాలు

దేశంలో కొవిడ్​ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య 779కి చేరింది. రాజస్థాన్​లో కొత్తగా 25 మందికి వైరస్​ సోకగా.. బాధితుల సంఖ్య 2 వేలు దాటింది. కర్ణాటకలో మరో 15 మంది కొవిడ్​ బారిన పడ్డారు.

According to the latest figures from the Central Health Department .. Corona cases reached 24,942. Of these, 5,210 were recovered and 779 died.
కరోనా కలవరం: దేశంలో 779కి పెరిగిన మరణాలు

By

Published : Apr 25, 2020, 7:04 PM IST

భారత్​లో కరోనా వేగం పుంజుకుంటోంది. రాష్ట్రాలన్నీ లాక్​డౌన్​ చర్యలు చేపట్టినప్పటికీ.. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 24,942 మందికి వైరస్​ నిర్ధరణ అయ్యింది.

దేశంలో కరోనా కేసు వివరాలు

రాష్ట్రాల్లో ప్రభావం ఇలా...

  • మధ్యప్రదేశ్​ ఇండోర్​లో మరో ఇద్దరు కరోనాతో మరణించారు. నగరంలో మెత్తం మృతుల సంఖ్య 57కు చేరింది. గత 24 గంటల్లో 56 మందికి వైరస్​ సోకగా.. బాధితుల సంఖ్య 1,085కు పెరిగింది.
  • రాజస్థాన్​లో శనివారం 25 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,059 మందికి పాజిటివ్​ నిర్ధరణ అయ్యింది. 32 మంది వైరస్​తో మరణించారు.
  • కర్ణాటక బెంగళూరులో కొత్తగా 15 మందికి కరోనా సోకింది. ఇప్పటివరకు 500 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
  • కోల్​కతాలో శిశువుకు జన్మనిచ్చిన ఓ మహిళకు కొవిడ్​ పాజిటివ్​ తేలింది. వెంటనే ఆమెను మరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారిని ఐసోలేషన్​లో ఉంచి.. పరీక్షలు నిర్వహిస్తున్నారు. బంగాల్​లో మొత్తం 18 మంది వైరస్​కు బలయ్యారు. 485 మందికి ఈ మహమ్మారి సోకింది.
  • జమ్మకశ్మీర్​లో మరొకరు వైరస్​కు బలయ్యారు. ఇప్పటివరకు మొత్తం ఆరుగురు వైరస్​కు బలయ్యారు. మరో 40 మందికి కరోనా​ సోకగా.. మహమ్మారి బారిన పడ్డ వారి సంఖ్య 494కు చేరింది.
  • బిహార్​లో కొత్తగా ఐదుగురు మహమ్మారి బారిన పడ్డారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య 228కి పెరిగింది.
  • పంజాబ్​లోని ఆరు జిల్లాల్లో వైరస్​ బాధితులంతా కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి కేసులు లేవని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details