తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్ర మంత్రి రవిశంకర్​ హెలికాప్టర్​కు ప్రమాదం - बिहार की राजनीति

accident of ravi shankar prasad helicopter in patna
కేంద్ర మంత్రి రవిశంకర్​ హెలికాప్టర్​కు ప్రమాదం

By

Published : Oct 17, 2020, 8:01 PM IST

Updated : Oct 17, 2020, 9:21 PM IST

21:19 October 17

కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌.. హెలికాప్టర్‌ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. బిహార్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన పట్నా విమానాశ్రయంలో తిరుగు పయనమవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్‌ రెక్కలు సమీపంలో విమానాశ్రయ వైరింగ్‌లను తాకడం వల్ల విరిగిపోయాయి. దీంతో హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదం నుంచి కేంద్ర మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. ఆ సమయంలో ఆయనతో పాటు బిహార్‌ ఆరోగ్య మంత్రి మంగల్‌పాండే, జలవనరుల మంత్రి సంజయ్‌జా ఉన్నారు.

19:56 October 17

కేంద్ర మంత్రి రవిశంకర్​ హెలికాప్టర్​​కు ప్రమాదం

కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ హెలికాప్టర్​.. బిహార్​ పట్నాలో​ ప్రమాదానికి గురైంది. కరెంట్​ తీగకు తగలడం వల్ల హెలికాప్టర్​ రోటర్​ బ్లేడ్​ దెబ్బతిందని... ఫలితంగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. హెలికాప్టర్​​ నుంచి ఆయన దిగిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు రవిశంకర్​ అనంతరం వెల్లడించారు. 

బిహార్​ జంజార్​పుర్​లో​​ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి రవిశంకర్​ వెళ్లారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం కలగలేదని తెలుస్తోంది.

Last Updated : Oct 17, 2020, 9:21 PM IST

ABOUT THE AUTHOR

...view details