కర్ణాటకలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. యలహంక నగరంలో కారు-అంబులెన్స్ ఢీకొని ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదం ధాటికి వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనలో గాయపడ్డ బాలుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
అంబులెన్స్-కారు ఢీ.. మృత్యువు ఒడికి కుటుంబం
కర్ణాటకలోని యలహంక వద్ద కారు-అంబులెన్స్ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వేగంగా ఢీకొట్టినందున వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి.
అంబులెన్స్-కారు ఢీ.. మృత్యువు ఒడిలోకి కుటుంబం
మృతులు బెంగళూరులో నివసిస్తున్న బంగాల్వాసులు. దీపక్ డే(46), స్వాగర చౌదరి(42), సుజయ్(45), జయతి(65), ధృవ డే(14)గా గుర్తించారు. సుజయ్‌ను విమానం ఎక్కించేందుకు కుటుంబం అంతా కలిసి విమానాశ్రయానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి- WC 19: ఈ దిగ్గజాలు ప్రపంచకప్ అందుకోలేకపోయారు..!
Last Updated : May 27, 2019, 11:20 AM IST