తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మీసానికి 'వీర' ఫ్యాన్స్ - మీసం

భారత వైమానిక దళ వింగ్ కమాండర్​ అభినందన్​పై యావత్​ దేశం అభిమానాన్ని చూపిస్తోంది. తాజాగా ఆయన​ 'మీసం' స్టైల్... యువకులను సెలూన్​ షాపులకు పరుగులు పెట్టిస్తోంది.

ఈ మీసం ట్రెండ్ గురూ!

By

Published : Mar 3, 2019, 3:52 PM IST

Updated : Mar 3, 2019, 4:05 PM IST

ఈ మీసం ట్రెండ్ గురూ!

సాధారణంగా అభిమాన హీరో సినిమా విడుదలైతే సంబరపడి స్టైల్​ మారుస్తుంటారు యువకులు. ఇప్పుడు మాత్రం గగన వీరుడు అభినందన్ వర్ధమాన్​ మీసం స్టైల్​నే ఫాలో అవుతున్నారు. గన్​ స్లింగర్ మీసం కోసం సెలూన్​లకు క్యూ కడుతున్నారు.

"రెండు రోజుల క్రితం అభినందన్​ పాకిస్థాన్​ నుంచి తిరిగి వచ్చారు. యువతలో ఆయనకు చాలా క్రేజ్​ ఉంది. రోజూ 5 నుంచి 10 మంది యువకులు సెలూన్​కు వస్తారు. ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోలు షారుక్​, సల్మాన్​ను ఫాలో అయ్యాం. అభినందన్ రియల్​ హీరో కనుక ఆయనలా మీసాలు, హెయిర్​ స్టైల్​ కావాలని అడుగుతున్నారు. మేము చేస్తున్నాం." - సమీర్​ ఖాన్​, సెలూన్​ యజమాని, బెంగళూరు

సెలూన్ షాపుల్లో ఒకప్పుడు ధోని హెయిర్​ స్టైల్​ యమా ట్రెండ్​ సృష్టించింది. ప్రస్తుతం అభినందన్​ స్టైల్​ హవా నడుస్తోంది.

"ఇది అభినందన్​ సార్​ స్టైల్​. నేను ఆయన అభిమానిని. అందుకే అనుసరిస్తున్నాను. ఆయన రియల్​ హీరో. ఇలా చేయడం నాకు నచ్చింది, బావుంది. అందుకే ఈ స్టైల్ చేయించుకున్నాను."
-మహ్మద్​ చాంద్, అభినందన్​ అభిమాని, బెంగళూరు

Last Updated : Mar 3, 2019, 4:05 PM IST

ABOUT THE AUTHOR

...view details