భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్‌కు భగవాన్ మహవీర్ అహింస పురస్కారం దక్కింది. ఈ పురస్కారం అందుకోనున్న మొదటి వ్యక్తి ఆయనే కావడం విశేషం. అఖిల భారతీయ దిగంబర జైన్ మహాసమితి ఈ అవార్డు ఇవ్వనుంది.
అభినందన్‌కు అవార్డు - అవార్డు
అశేష జనభారతం అభిమానాన్ని సంపాదించుకున్నారు వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్. ఆయన్ను విశిష్ట పురస్కారంతో గౌరవించనున్నట్లు ప్రకటించింది అఖిల భారతీయ దిగంబర జైన్ మహాసమితి.
అభినందన్
దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సంస్థ ఛైర్పర్సన్ మహీంద్రా జైన్ అధికారిక ప్రకటన చేశారు. జ్ఞాపిక, రూ.2.51 లక్షల నగదు, ప్రశంస పత్రంతో కూడిన పురస్కారాన్ని ఏప్రిల్ 17న అందజేస్తామని చెప్పారు.