తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాసేపట్లో పైలట్​ రాక

వాయుసేన వింగ్​ కమాండర్ అభినందన్​ను కాసేపట్లో పాక్ భారత్​కు అప్పగించనుంది. అభినందన్​ రాక దృష్ట్యా వాఘా సరిహద్దు సందడిగా మారింది.

By

Published : Mar 1, 2019, 2:04 PM IST

అభినందన్

భారత వాయుసేన పైలెట్​ అభినందన్​ విడుదలకు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో ఆయన స్వదేశంలో కాలు మోపనున్నారు. మధ్యాహ్నం అభినందన్​ను భారత్​కు అప్పగిస్తామని పాక్​ విదేశాంగ మంత్రి మహమ్మూద్ ఖురేషీ స్పష్టం చేశారు.

మీ జోక్యం కావాలి..

దక్షిణాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గించడానికి ఐక్యరాజ్య సమితి, రష్యా జోక్యం చేసుకోవాలని ఖురేషీ కోరారు.

నేను హాజరుకాను:

అంతర్జాతీయ విదేశాంగ శాఖ మంత్రుల సమావేశానికి తాను హాజరు కావడం లేదని ఖురేషీ స్పష్టం చేశారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్​ హాజరు కావడమే ఇందుకు కారణంగా పేర్కొన్నారు.

సందడిగా వాఘా సరిహద్దు:

అభినందన్​కు స్వాగతం పలికేందుకు వాఘా సరిహద్దుకు చేరుకున్నారు భారత వైమానిక దళ అధికారులు. ప్రస్తుతం అమృత్​సర్​లో పర్యటిస్తోన్న పంజాబ్​ ముఖ్యమంత్రి కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ అభినందన్​కు స్వాగతం పలికేందుకు వాఘా చేరుకున్నారు.

అభినందన్​ వస్తున్నాడు

ABOUT THE AUTHOR

...view details