తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా విద్యార్థులు రికార్డు సృష్టించారు. ఆవడాయి ప్రభుత్వ పాఠశాల ఆధ్వర్యంలో బేటీ పడావో... 'బేటీ బచావో' చిహ్న ఆకారంలో కూర్చుని ఈ ఘనత సాధించారు.
బేటీ బచావోపై లోగోతో విద్యార్థుల రికార్డు - world record
తమిళనాడు తిరువళ్లూరుకు చెందిన ఆవడాయి ప్రభుత్వ పాఠశాల ప్రపంచ రికార్డు సృష్టించింది. 12 వేల అడుగుల విస్తీర్ణంలో జిల్లాకు చెందిన విద్యార్థులు 'బేటీ బచావో- బేటీ పడావో' చిహ్నం రూపంలో కూర్చున్నారు. ఈ కార్యక్రమం ఇండియన్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
బేటీ బచావోపై లోగోతో విద్యార్థుల రికార్డు
2 వేల మంది విద్యార్థులు... 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో బేటీ పడావో చిహ్నాన్ని ఏర్పరిచారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ గుర్తింపు లభించింది. ఈ రికార్డును తిరువళ్లూరు కలెక్టర్ మహేశ్వరి రవికుమార్ చేతుల మీదుగా ఆవడాయి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అందుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం బాలికల సంక్షేమం కోసం 'బేటీ బచావో-బేటీ పడావో' కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఇదీ చూడండి: వైరల్: బాలీవుడ్ పాట బ్యాక్‌గ్రౌండ్‌తో పోలీసుల కవాతు