తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్త విస్తరణ దిశగా 'ఆప్'-త్వరలో ప్రచార కార్యక్రమం

అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి దిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమ్​ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా తమ ఉనికిని చాటుకునే దిశగా అడుగులు వేస్తోంది. త్వరలో దేశ నిర్మాణం అనే పేరుతో ఓ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ మేరకు ఆప్ సీనియర్ నేత గోపాల్ రాయ్ ఓ ముఖాముఖి వేదికగా వెల్లడించారు.

By

Published : Feb 15, 2020, 6:23 AM IST

Updated : Mar 1, 2020, 9:30 AM IST

aap
దేశవ్యాప్త విస్తరణ దిశగా ఆప్-త్వరలో ప్రచార కార్యక్రమం

దేశవ్యాప్త విస్తరణ దిశగా 'ఆప్'-త్వరలో ప్రచార కార్యక్రమం

దిల్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో దేశవ్యాప్తంగా తమ ఉనికిని చాటుకునే దిశగా అడుగులు వేస్తోంది ఆమ్​ఆద్మీ పార్టీ. దేశంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 'సానుకూల జాతీయవాదం' పేరుతో ఆదివారం జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు ఆప్ సీనియర్ నేత గోపాల్ రాయ్ ఓ ముఖాముఖి వేదికగా వెల్లడించారు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం పార్టీ నిర్ణయమని, ఇందులో భాగంగానే మొదటి విడతగా పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో పోటీచేసినట్లు గోపాల్​ రాయ్ తెలిపారు.

ఈ సందర్భంగా భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు రాయ్. వారి జాతీయవాదం ప్రతికూలమైనదని పేర్కొన్నారు. త్వరలో ఆప్​ చేపట్టనున్న సానుకూల జాతీయవాద ప్రచారం ద్వారా పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

"దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలనే ఎజెండాతో ఆదివారం జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. పార్టీ కార్యకర్తలు, కేడర్​ను దేశం మొత్తంలో విస్తరించాలనే అంశమై చర్చించనున్నాం. దిల్లీలో చేపట్టిన ప్రయోగాత్మక పాలన యావత్​ భారతానికి ఆదర్శం. అందరికీ మంచి విద్య, ఆరోగ్య సౌకర్యాలు, వసతి సౌకర్యాల కల్పన అనేవి మా సానూకూల జాతీయవాద విధానంలో భాగం."

-గోపాల్ రాయ్, ఆప్ సీనియర్ నేత

త్వరలో దేశ నిర్మాణం అనే ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు రాయ్. ఇందులో భాగం కావాలనే ఔత్సాహికులు 9871010101 అనే నెంబర్​కు మిస్స్​డ్ కాల్ ఇవ్వాలని సూచించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, గుజరాత్ సహా దేశవ్యాప్తంగా పోటీలో నిలవనున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి:సీఏఏ ఆందోళనలు హింసాత్మకం... నలుగురు పోలీసులకు గాయాలు

Last Updated : Mar 1, 2020, 9:30 AM IST

ABOUT THE AUTHOR

...view details