తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నాన్నా.. అమ్మను, తమ్ముడిని బాగా చూసుకో గుడ్​బై'

కర్ణాటకలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విషం తాగేశాక తండ్రితో మాట్లాడుతూ ఓ వీడియో రికార్డ్​ చేశాడు. ఇందులో అమ్మను, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోమని తన తండ్రిని కోరుతూ కుప్పకూలిపోయాడు.

A youth asked sorry to his father in live vedio before commiting suicide
'నాన్నా.. అమ్మను, తమ్ముడిని బాగా చూసుకో గుడ్​బై'

By

Published : Dec 23, 2019, 9:13 AM IST

'నాన్నా.. విషం తాగేశాను, నాన్నా.. నేను చచ్చిపోతున్నాను బై. నేనేం తప్పు చేయలేదు.. నాకు బతకాలనుంది నాన్నా. అమ్మను, తమ్ముడిని బాగా చూసుకో నాన్నా గుడ్​బై...' ప్రాణం విడిచే కొద్ది క్షణాల ముందు మధు మాట్లాడిన చివరి మాటలివి.

'నాన్నా.. అమ్మను, తమ్ముడిని బాగా చూసుకో గుడ్​బై'

కర్ణాటక చిక్కబళ్లాపూర్​ చింతామణి తాలూకా వైజ్​కురు గ్రామానికి చెందిన 23 ఏళ్ల మధు ​విషం తాగి వీడియో రికార్డు చేసి మరీ కన్నుమూశాడు. జీవితంలో నిండిపోయిన అసంతృప్తి వల్లే ఇలా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

పాలీడల్​ అనే పురుగుల మందు తాగేసి తన తండ్రితో చివరిసారిగా చెప్పాలనుకున్నవన్నీ వీడియోలో చెప్పాడు. మృత్యువు చేరువవుతున్న కొద్దీ మధుకు బతకాలనే ఆశ కలిగింది. అయితే, విషయం తెలుసుకుని ఆసుపత్రిలో చేర్చేసరికి ఆలస్యమయ్యింది. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

ఇదీ చదవండి:దిల్లీలో అగ్నిప్రమాదం.. 9 మంది మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details