మహారాష్ట్ర వార్దాలోని హింగాన్ఘాట్లో ఓ యువతిపై పెట్రోల్ పోసి సజీవ దహనానికి యత్నించాడో దుండగుడు.
లెక్చరర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన మాజీ ప్రియుడు - A young lecturer from Wardha was set on fire by her ex boyfriend in maharastra
మహారాష్ట్ర వార్దాలో దారుణానికి ఒడిగట్టాడు ఓ కిరాతకుడు. కళాశాల లెక్చరర్‌గా పనిచేస్తున్న మాజీ ప్రేయసిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నడిరోడ్డుపై మంటల్లో కాలిపోతున్న యువతిని స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. అయితే, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు వైద్యులు.
లెక్చరర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన మాజీ ప్రియుడు
బాధితురాలు ఓ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. ఉదయం నందోరీ చౌక్ దారిలో వెళ్తుండగా.. ఆమెపై పెట్రోల్ పోశాడు మాజీ ప్రియుడు విక్కీ. అందరూ చూస్తూండగానే నిప్పంటించాడు. మంటల్లో కాలిపోతున్న యువతిని రక్షించి జిల్లా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. పరిస్థితి విషమంగా ఉందని ఆమెను నాగ్‌పుర్ ఆసుపత్రికి మార్చినట్లు తెలిపారు పోలీసులు. ఘటనకు గల కారణాలపై పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
Last Updated : Feb 29, 2020, 12:02 AM IST