తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముఖంపై 20 కొడవలి పోట్లు, 200 కుట్లు- మహిళ మృతి - ముఖంపై 20 కొడవలి పోట్లు, 200 కుట్లు- మహిళ మృతి

ఛత్తీస్​గఢ్​లో ఓ మానవ మృగం రెచ్చిపోయాడు. మహిళ ముఖంపై 20 సార్లు కొడవలితో దాడి చేశాడు. వైద్యులు ఆమె ముఖానికి 200 కుట్లు వేసినా.. లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ.. ఆమె ప్రాణాలు విడిచింది.

a woman died after 20 attacks on her face in chattisgarh korba
ముఖంపై 20 కొడవలి పోట్లు, 200 కుట్లు- మహిళ మృతి

By

Published : Dec 9, 2019, 10:12 AM IST

ఛత్తీస్​గఢ్​ కోర్బా జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. తనపై కేసు పెట్టిందన్న కోపంతో జైలు నుంచి వచ్చి ఆ మహిళ ముఖంపై కొడవలితో దాడి చేసి ప్రాణాలు తీశాడు ఇంద్రపాల్​ తొండే అనే కిరాతకుడు.

ముఖంపై 20 కొడవలి పోట్లు, 200 కుట్లు- మహిళ మృతి

బాధితురాలు భర్తకు దూరంగా ఒంటరిగా నివాసముంటోంది. అదే కాలనీకి చెందిన ఇంద్రాపాల్ తొండే ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. అభ్యంతరకర వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్​లోడ్​ చేస్తానని బెదిరించాడు. ఆ మహిళ కేసు పెట్టగా... ఇంద్రపాల్​ కటకటాల పాలయ్యాడు. జైలుకు వెళ్లి వచ్చిన ఇంద్రపాల్.. ఆమెపై కోపంతో ఊగిపోయాడు. కొడవలితో 20 సార్లకుపైగా ఆమె ముఖంపై దాడి చేశాడు.

తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని 112కి ఫోన్​ చేసి ఆసుపత్రిలో చేర్చారు స్థానికులు. ఆమె ముఖానికి దాదాపు 200 కుట్లు పడ్డాయి. అయినా ఫలితం దక్కలేదు. తీవ్ర రక్తస్రావం కారణంగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఐపీసీ సెక్షన్​ 307 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

ఇదీ చదవండి:'ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details