తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లంచం తీసుకున్న భాజపా కార్యకర్త- వీడియో వైరల్​ - సోషల్​ మీడియా

అహ్మదాబాద్​లో ఓ నిర్మాణదారుడి​ నుంచి భాజపా కార్యకర్త డిమాండ్​ చేసి లంచం తీసుకుంటున్న వీడియో సోషల్​ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఘటన వెలుగులోకి వచ్చిన అనంతరం.. అతడిని పార్టీ సస్పెండ్​ చేసింది.

లంచం తీసుకున్న భాజపా కార్యకర్త- వీడియో వైరల్​

By

Published : Aug 24, 2019, 5:09 PM IST

Updated : Sep 28, 2019, 3:15 AM IST

లంచం తీసుకున్న భాజపా కార్యకర్త- వీడియో వైరల్​

గుజరాత్​ అహ్మదాబాద్​లో ఓ నిర్మాణదారుడి​ నుంచి లంచం తీసుకున్నాడో భాజపా కార్యకర్త. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది. అనంతరం.. నగర పార్టీ అధ్యక్షుడు జగ్​దీశ్​ పంచల్​.. కార్యకర్త పుల్కిత్​ వ్యాస్​ను​ సస్పెండ్​ చేశారు.

ఇసాన్​పుర్​ వార్డు సభ్యుడైన​ వ్యాస్​... ఓ బిల్డర్​ నుంచి రూ. 10 వేలు డిమాండ్​ చేసి తీసుకున్నట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

''మీరేం ఆందోళన చెందవద్దు. అహ్మదాబాద్​ పురపాలక సంస్థ​(ఏఎంసీ)​ అధికారుల నుంచి మీ పని జరిగేలా చూసుకుంటాను'' అని వ్యాస్​ అన్న మాటలు వీడియోలో రికార్డయ్యాయి.

ఒకవేళ రూ. 5000 ఎక్కువగా లంచం ఇస్తే.. తన పలుకుబడిని ఉపయోగించి అన్ని కూల్చివేతలు మరో 3 నెలల వరకు ఆగేలా ఏఎంసీ నుంచి నోటిఫికేషన్​ జారీ చేయించగలనన్న మాటలు వైరల్​గా మారాయి.

బిల్డర్​, భాజపా కార్యకర్త సంభాషణ:

  • పుల్కిత్​ వ్యాస్ ​:ఈ ప్రాంతంలో కొన్ని ఇళ్లు నిర్మించాలంటే నాకు డబ్బులు కావాలి.
  • బిల్డర్ ​:నీకు ఎంత కావాలి?

నిర్మాణదారుడు రూ. 10వేలు ఇచ్చాడు.

  • పుల్కిత్​ వ్యాస్ ​: నాకు మరో రూ. 5 వేలు కావాలి.
  • బిల్డర్​ :వేరే వ్యక్తులు నన్ను అడిగితే ఏం చేయాలి?
  • పుల్కిత్​ వ్యాస్​ : అహ్మదాబాద్​ పురపాలక సంఘం గురించి ఆందోళన వద్దు. అధికారులను నేను చూసుకుంటా.

మరికొన్ని నెలల వరకు ఆ ప్రాంతంలో అన్ని కూల్చివేతలు ఆగేలా ఆ అధికారులు చూసుకుంటారు. నాపై నమ్మకముంచు..!

Last Updated : Sep 28, 2019, 3:15 AM IST

ABOUT THE AUTHOR

...view details