దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. దిల్లీ ఎయిమ్స్‌లో స్థానిక పారిశుద్ద్య కార్మికుడు మనీష్ కుమార్‌కు తొలి టీకాను వేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సమక్షంలో కొవిడ్ యోధుడికి వ్యాక్సిన్ అందించారు.
దేశంలో కరోనా కట్టడి కోసం.. ఆరంభం నుంచి అహర్నిశలు కృషి చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ఇతర కరోనా యోధులు వ్యాక్సిన్‌కు మొదటి హక్కుదారులని ప్రధాని స్పష్టం చేశారు. దీనికి తగినట్లుగానే దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో పారిశుద్ధ్య కార్మికులకే తొలి టీకాను అందిస్తున్నారు.