తెలంగాణ

telangana

By

Published : Oct 16, 2019, 5:47 AM IST

ETV Bharat / bharat

ప్లాస్టిక్​ సంచుల కన్నా ఈ నూలు బ్యాగులు మిన్న​!

చూస్తుండగానే మన జీవితాల్లోకి చొరబడి ఇప్పుడు హానికారకంగా మారిన ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు యావత్​ ప్రపంచం ప్రయత్నిస్తోంది. స్వయానా భారత ప్రధాని నరేంద్ర మోదీ మహాబలిపురంలో సాగర తీరాన ప్లాస్టిక్​ను ఎత్తివేసి ఆ రక్కసిని ఏరిపారేద్దామని పిలుపునిచ్చారు. అయితే.. ఎవరెన్ని చెప్పినా మనలో మార్పు వచ్చినప్పుడే కదా అది సాధ్యం. ఈ అంశాన్ని గట్టిగా నమ్మారు కేరళకు చెందిన ఓ టీచర్​, అందుకే ప్లాస్టిక్​ రహిత నూలు బ్యాగులను తయారు చేస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

సరికొత్త నూలు సంచులతో ప్లాస్టిక్​కు చెక్​!

సరికొత్త నూలు సంచులతో ప్లాస్టిక్​కు చెక్​!

కేరళ కోజికోడ్​కు చెందిన గీతబాయి అనే విశ్రాంత ఉపాధ్యాయురాలు ఆకర్షణీయమైన పర్యావరణహిత నూలు బ్యాగులు తయారు చేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు.

ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్​పై అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్తంగా నిషేధం విధించినప్పటికీ, మార్కెట్​లో ప్లాస్టిక్​కు​ ప్రత్యామ్నాయంగా వేరే వస్తువు లేనప్పుడు అదెలా సుసాధ్యం అవుతుంది? అందుకే నిత్యం వాడే ప్లాస్టిక్​ బ్యాగుల స్థానంలో నూలు వస్త్రాలతో తయారు చేసిన బ్యాగులను వాడాలనే సందేశంతో గురుకులం ఆర్ట్​ గ్యాలరీ వద్ద ఈ బ్యాగుల ప్రదర్శన ఏర్పాటు చేశారు గీత.

ఆలోచన పుట్టిందిలా..

ఈ వస్త్ర బ్యాగుల తయారీ గురించి యూట్యూబ్​లో చూసి తెలుసుకున్నారు గీత. ప్లాస్టిక్​ రహిత ఉపకరణాలు తయారు చేయాలన్న ఆమె ఆలోచనకు భర్త ప్రోత్సాహం తోడైంది. అలా ఐదేళ్ల క్రితం మహిళలు, పురుషులకు పర్స్​లు, బ్యాగులు తయారు చేయడం ప్రారంభించారు.

అమ్మాయిలు కళాశాలలకు, కార్యాలయాలకు, పార్టీలకు తీసుకువెళ్లేలా, పిల్లలకూ నచ్చే విధంగా విభిన్న డిజైన్​లలో, బోలెడన్ని రంగుల్లో నూలు బ్యాగులు తయారుచేసి విక్రయిస్తున్నారు.
ఈ అందమైన సంచుల ధరలు డిజైన్​ను బట్టి 50 రూపాయల నుంచి 500 రూపాయల దాకా ఉన్నాయి. ప్లాస్టిక్​ వాటికన్నా దారపు పోగులతో చేసిన బ్యాగులే మిన్నా అని చెబుతున్న గీతకు సర్వత్రా ప్రశంసలందుతున్నాయి.

ఇదీ చూడండి:మన్మోహన్​ను అనుసరించమన్న భర్త... మరి మంత్రి ఏమన్నారు!

ABOUT THE AUTHOR

...view details