తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో అంతర్గత యుద్ధానికి పాక్​ కుట్ర! - కశ్మీర్

ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై  భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పలు దేశాల మద్దతు ఆశించి భంగపడ్డ పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శిస్తోంది. భారత్‌లో దాడులకు పథక రచన చేస్తున్నట్లు నిఘావర్గాలకు సమాచారం అందింది. పీవోకే ద్వారా ఉగ్రమూకలను తరలించి కశ్మీర్‌లో అంతర్గత యుద్ధం సృష్టించేందుకు పాక్‌ చేస్తున్న కుటిలయత్నాలు తాజాగా బహిర్గతమయ్యాయి.

కశ్మీర్​లో అంతర్గత యుద్ధానికి పావుల కదుపుతున్న పాక్​

By

Published : Sep 5, 2019, 10:33 PM IST

Updated : Sep 29, 2019, 2:22 PM IST

ఆర్టికల్​ 370 అధికరణ రద్దు నిర్ణయంపై అమెరికా సహా పలు దేశాల మద్దతు ఆశించి భంగపడిన పాకిస్థాన్‌ భారత్‌లో దాడులకు పథక రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రమూకలతో కలిసి దాడులకు వ్యూహం పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది.

ఇస్లామిక్​ సంస్థలతో కలిసి

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ద్వారా దేశంలోకి చొరబాట్లకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్న పాక్​.. జమాత్ ఇస్లామిక్ సంబంధించిన సంస్థలతో చేతులు కలిపి క్యాంపులు నిర్వహిస్తోంది. జైషే మహ్మద్​, హిజ్బుల్​ ముజాహిద్దీన్​, లష్కరే తొయిబా సంస్థలు ఇందులో పాలుపంచుకుంటున్నట్లు సమాచారం. జమాతే ఇస్లామీ పీవోకే అధ్యక్షుడు ఇజాజ్ అఫ్జల్​ రావల్‌కోట్ వద్ద ఉగ్రనేతలతో భేటీ అయిన ఫొటోలను ఇంటెలిజెన్స్ బ్యూరో సేకరించింది. ఉగ్ర నేతలతో తరనూటి, పోతిబాల పరిసరాల్లో అఫ్జల్‌ భేటీ అయినట్టు కీలక ఆధారాలు సేకరించింది.

పీవోకే ద్వారా

ఉగ్రమూకలు ఒకేచోట లేకుండా నిత్యం సంచరించేలా తీవ్రవాద సంస్థలు చర్యలు తీసుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. గత నెల రెండో వారం నుంచి హెచ్‌ఎం కమాండర్ షంషేర్ ఖాన్ నేతృత్వంలో ప్రణాళికలు రూపొందించినట్టు సమాచారం. పీవోకే ద్వారా వీలైనంత మంది ముష్కరులను కశ్మీర్‌లోకి పంపేలా ఏర్పాట్లు చేసినట్లు గుర్తించిన ఐబీ, ఐఎస్​ఐ సహకారం అందించేలా సమాచార వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు గుర్తించింది.

కొత్తగా పదివేల మంది

ఉగ్ర సంస్థల ద్వారా 10 వేల మందికి పైగా కొత్త వారిని ఉగ్రవాదులుగా మార్చేందుకు ఐఎస్ఐ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్థాన్‌లోని ఖైబర్​ పంఖ్తుఖ్వా రాష్ట్రంలోని వజీరస్థాన్‌లో కొత్త ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. భద్రతా దళాలపై దాడులే లక్ష్యంగా పనిచేసేలా వీరిని ఉసిగొల్పుతున్నట్లు సమాచారం.

పాక్‌ గడ్డపై ఉగ్రమూకలకు సహకరించవద్దని ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ చేస్తున్న ఒత్తిడిని లెక్కపెట్టకుండా పాకిస్థాన్ జమ్ముకశ్మీర్‌లో అంతర్గత యుద్ధం సృష్టించేందుకు కుట్ర పన్నుతోంది. జైషే మహ్మద్‌కు చెందిన మౌలానా మసూద్ అజార్, లష్కరే తొయిబాకి చెందిన జాకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ సహా పలువురు నేతలను కొత్త యూఎపీఎ చట్టం ప్రకారం ఉగ్రవాదులుగా కేంద్రం ప్రకటించిన గంటల వ్యవధిలోనే పాక్ ఈ కుట్రలకు తెరలేపింది.

ఇదీ చూడండి:జియో ఎఫెక్ట్​: అరచేతిలో అంతర్జాల విప్లవం

Last Updated : Sep 29, 2019, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details