తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వేల రూపాయలున్న సంచితో చెట్టెక్కిన కోతి! - viral videos

ఆ వానరానికి ఆకలి దంచేస్తోంది. ఇంతలో ఓ వ్యక్తి దగ్గరున్న సంచి తన కంటపడింది. వెంటనే లాక్కుని చెట్టేకేసింది. కానీ, ఏం లాభం అందులో 57 వేల రూపాయలున్నాయే కానీ కనీసం ఓ పండైనా లేదాయే. అందుకే, ఆ కాగితాలను ఏరుకుంటున్న మనుషుల వంక వెటకారంగా చూసి ఆ సంచి అక్కడ పడేసి వెళ్లిపోయింది.

వేల రూపాయలున్న సంచితో చెట్టెక్కిన కోతి!

By

Published : Oct 2, 2019, 2:31 PM IST

Updated : Oct 2, 2019, 9:20 PM IST


ఉత్తరప్రదేశ్​ బదాయూలో 57 వేల రూపాయలున్న సంచిని పట్టుకెళ్లి హల్​చల్​ చేసింది ఓ వానరం .

vవేల రూపాయలున్న సంచితో చెట్టెక్కిన కోతి!

న్యాయవాదితో పని పడి బయటికి వచ్చిన వ్యక్తి... పనిలో పనిగా తన దగ్గరున్న 57 వేల నగదును బ్యాంక్​లో జమ చేయాలనుకున్నాడు. ఆరుబయట కూర్చుని వకీలు చెప్పిన నోటరీ దస్తావేజులు నింపడంలో నిమగ్నమైన అతడు డబ్బు సంచిని కాసేపు పక్కన పెట్టాడు. చెట్టు మీది కోతి.. టక్కున వచ్చి డబ్బుల సంచిని అందుకుని మళ్లీ పైకెక్కేసింది.

చెట్టుపై తాపీగా కూర్చుని సంచిలో తినుబండారాల కోసం వెతికింది. నోట్లన్నీ చిందరవందరగా విసిరేసింది. అన్ని వేల రూపాయలున్నా.. అవి తన ఆకలి తీర్చలేని చిత్తు కాగితాలే అనుకున్న వానరం ఆ సంచిని అక్కడే పడేసింది. ఆ వ్యక్తి అరుపులకు అప్పటికే అక్కడ గుమిగూడిన జనం మాత్రం ఆ నోట్లను పట్టుకునేందుకు ఎగబడ్డారు. చాలా మంది నోట్లను ఆ వ్యక్తికి తిరిగి ఇచ్చేయగా కొంత డబ్బు మాత్రం నష్టపోయాడు.

ఇదీ చూడండి:'బాస్'బస్టర్​ ఇచ్చినందుకు థాంక్యూ నాన్న'

Last Updated : Oct 2, 2019, 9:20 PM IST

ABOUT THE AUTHOR

...view details